వీటిపై ‘శీత’కన్నొద్దు

శీతాకాలం వ్యాయామానికి అనుకూలమైన సమయం. త్వరగా అలసిపోకుండా ఎన్ని కసరత్తులైనా చేసుకోవచ్చు. అయితే కొన్ని జాగ్రత్తలు మాత్రం అవసరం అంటున్నారు ఫిట్‌నెస్‌ ట్రైనర్లు. అవే ఇవి...

Published : 10 Nov 2018 00:44 IST

వీటిపై ‘శీత’కన్నొద్దు

శీతాకాలం వ్యాయామానికి అనుకూలమైన సమయం. త్వరగా అలసిపోకుండా ఎన్ని కసరత్తులైనా చేసుకోవచ్చు. అయితే కొన్ని జాగ్రత్తలు మాత్రం అవసరం అంటున్నారు ఫిట్‌నెస్‌ ట్రైనర్లు. అవే ఇవి...

బాడీ వార్మప్‌ 
వ్యాయామానికి ముందుగా శరీరాన్ని సిద్ధం చేయడం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. శీతాకాలంలో ఇది మరీ అవసరం. మిగతా కాలంలో శరీరంలో వేడి కొంత ఉండటం వల్ల అవయవాలన్నీ కదలడానికి సిద్ధంగా ఉంటాయి. అదే శీతాకాలంలో అయితే వేడి తగ్గిపోయి.. కండరాలు బిగుసుకుపోతాయి. అందుకే ఈ కాలంలో వ్యాయామానికి ముందు వార్మప్‌ ఎంతో ముఖ్యం. దీంతో వ్యాయామం చేసే సమయంలో గాయాల బారిన పడకుండా కండరాలను కాపాడుకోవచ్చు. డైనమిక్‌ వార్మప్‌ చేస్తే మంచిది. బాడీ వెయిట్‌ ఎక్సర్‌సైజ్‌లు, రోవింగ్‌ మిషన్‌పై శరీరాన్ని కదిలించడం, బాల్‌ ఎక్సర్‌సైజులు లాంటివి వేగంగా చేయాలి. అప్పుడే శరీరంలో తగిన ఉష్ణోగ్రత పుడుతుంది.

తగినన్ని నీళ్లు 
శీతాకాలంలో దాహం తక్కువగా ఉంటుంది. పైగా వ్యాయామం చేస్తున్నప్పుడు చెమట రూపంలో ఒంట్లోని నీరు బయటికి వెళ్లిపోతుంది. దీనివల్ల డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. దీన్ని నివారించడానికి దాహం లేకపోయినా నీళ్లు తాగుతూ ఉండాలి. వ్యాయామ సమయంలోనూ కొద్దికొద్దిగా తాగుతుండటం మరిచిపోవద్దు.

గాయాల గురించి జాగ్రత్త 
శీతాకాలంలో గతంలో విరిగిన ఎముకలు, దెబ్బతిన్న కండరాల నొప్పులు ఎక్కువగా ఉంటాయి. వీటిని లక్ష్య పెట్టకుండా ఎక్కువ మంది వ్యాయామాలు చేస్తారు. ఇలా చేయడం వల్ల అవి మరింత ఇబ్బంది పెడతాయి. వీటి విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవాలి. ఏ అవయవాలైతే నొప్పి తీస్తున్నాయో వాటికి సంబంధించిన వ్యాయామాలను చేయకపోవడం మంచిది. లేదంటే నిపుణుల సలహా మేరకు చేయడం మేలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని