ఊ అంటావా బాబూ..
టీకా టీకా వేస్తామంటే
మాటే దాటా వేస్తావు
మాస్కు మాస్కు వేస్కోమంటే
లైటు తీస్కోమంటావు
టీకా వద్దు, మాస్కు వద్దు ఆహా! అయినా కరోనా రావొద్దు
నిజం చెప్పొద్దూ! నీ బుద్ధే వంకర బుద్ధి
ఊ అంటావా.. బాబూ, ఉఊ అంటావా బాబూ ।।
భౌతిక దూరం చూడమంటే.. బతుకే భారం అంటావూ...
గుంపులుగా గుమిగూడొద్దంటే కొంపలు మునిగేనంటావు
దూరం చూడవు, గుంపులు వీడవు పీకల మీదకు తెస్తావు
కొంచెం కూడా బాధ్యత లేని నీ బుద్ధే వంకర బుద్ధి
ఊ అంటావా.. బాబూ, ఉఊ అంటావా బాబూ ।।
దగ్గు, తుమ్ము వచ్చినా తగ్గేదేలే అంటావు
గమ్మున మూల కూర్చోక అందరికీ తిరిగి అంటిస్తావు
దగ్గు, తుమ్ము రావడం తప్పే కాదండీ
వచ్చినాకా.. ఊ.. ఊ.. డౌటే వచ్చినాకా.. టెస్టుకి వెళ్ళడం బెస్టే కదండీ
ఊ అంటావా.. బాబూ, ఉహూ అంటావా బాబూ ।।
జర జాగ్రత్త పడితే నువ్వు..
వైరస్ అదుపులో ఉంటుందీ
నిన్నటి కష్టాలు గురుతేవుంటే, రేపటి నష్టాలు తగ్గేనండీ
నాకేం కాదని నీలుగుతుంటే..,
ఊ.. ఊ..
వంకర బుద్ధితో ఊరేగుతుంటే ఒమిక్రాన్ భయంకరి చెలరేగేనండి
ఊ అంటావా.. బాబూ, ఉఊ అంటావా బాబూ।।
(పుష్ప సినిమాలో ‘ఊ అంటావా.. మామా, ఉఊ అంటావా..’ పాటకు పేరడీ)
- డా.డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News: మైనర్ ఘాతుకం.. 58 ఏళ్ల మహిళపై అత్యాచారం.. ఆపై హత్య!
-
Crime News
Cyber Crime: ఈ-కామర్స్ ఓటీపీ పేరుతో కొత్త పంథాలో సైబర్ మోసం!
-
Sports News
Harmanpreet Kaur: మా దృష్టి వేలంపై లేదు.. పాక్‌తో మ్యాచ్‌పైనే ఉంది: హర్మన్ ప్రీత్ కౌర్
-
India News
Assam: బాల్య వివాహాలు.. 3 రోజుల్లో 2,278మంది అరెస్టు
-
Politics News
Karnataka: ఇవే నా చివరి ఎన్నికలు.. సిద్ధరామయ్య సంచలన నిర్ణయం!
-
Movies News
NTR: నా భార్య కంటే ముందు మీకే చెబుతా.. దర్శక- నిర్మాతలపై ఒత్తిడి తేవొద్దు: ఎన్టీఆర్