AP News: తిరుపతి ఐఐటీలో కరోనా కలకలం

చిత్తూరు జిల్లా తిరుపతి ఐఐటీ క్యాంపస్‌లో కరోనా కలకలం రేపుతోంది. ఏర్పేడు సమీపంలోని ఐఐటీ శాశ్వత ప్రాంగణంలో 75మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

Published : 23 Jan 2022 01:44 IST

ఏర్పేడు: చిత్తూరు జిల్లా తిరుపతి ఐఐటీ క్యాంపస్‌లో కరోనా కలకలం రేపుతోంది. ఏర్పేడు సమీపంలోని ఐఐటీ శాశ్వత ప్రాంగణంలో 75మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఐఐటీ క్యాంపస్‌లో 214 మంది విద్యార్థులు, సిబ్బందికి కరోనా పరీక్షలు చేయగా.. 45మంది విద్యార్థులు, 30మంది సిబ్బందికి పాజిటివ్‌గా తేలినట్టు అధికారులు వెల్లడించారు. దీంతో ఐఐటీ వసతి గృహాన్నే కొవిడ్‌ కేంద్రంగా అధికారులు మార్చారు. ఈ నెల మొదటి వారంలో సుమారు 600 మంది విద్యార్థులు తమ సొంత ప్రదేశాలకు వెళ్లడంతో ప్రస్తుతం బీటెక్‌, ఎంటెక్‌, పీహెచ్‌డీ చివరి సంవత్సరం విద్యార్థులు మాత్రమే క్యాంపస్‌లో ఉన్నారని తెలిపారు. కొవిడ్‌ వ్యాప్తి చెందకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు తెలిపారు. మరోవైపు, చిత్తూరు జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. శనివారం జిల్లా వ్యాప్తంగా 1566 కేసులు వెలుగుచూశాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని