కృష్ణా బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయండి

కృష్ణా నది యాజమాన్య బోర్డును (కేఆర్‌ఎంబీ) కర్నూలులో ఏర్పాటు చేయాలని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ జల్‌శక్తి స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ సంజయ్‌ జైస్వాల్‌కు విజ్ఞప్తి చేశారు.

Updated : 20 May 2022 06:16 IST

జల్‌శక్తి స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌కు ఎంపీ మాధవ్‌ వినతి

ఈనాడు, దిల్లీ: కృష్ణా నది యాజమాన్య బోర్డును (కేఆర్‌ఎంబీ) కర్నూలులో ఏర్పాటు చేయాలని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ జల్‌శక్తి స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ సంజయ్‌ జైస్వాల్‌కు విజ్ఞప్తి చేశారు. గురువారం జల్‌శక్తి స్టాండింగ్‌ కమిటీ సమావేశం అనంతరం సాగు నీటికి సంబంధించి అంశాలపై జైస్వాల్‌తో చర్చించి వినతిపత్రం అందించారు. ఏపీ పునర్విభజన చట్టాన్ని గౌరవించి తెలుగు గంగ, వెలిగొండ, గాలేరు నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులను అనుమతి పొందిన వాటిగా ప్రకటించాలని కోరారు. రాష్ట్రంలో జలాల అంతర్గత సర్దుబాటు చేసుకునే హక్కు రాష్ట్రానికే ఉండేలా నోటిఫికేషన్‌లో స్పష్టంగా పేర్కొనాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని