Andhra News: ఒక నెల నగదు తీసుకున్నాక, తర్వాత నెల బియ్యం కావాలంటే..

‘కార్డుదారులు ఇష్టం మేరకు నగదు కానీ, బియ్యం కానీ తీసుకోవచ్చు. ఇందులో ఎటువంటి ఒత్తిడి ఉండదు. ఒక నెల నగదు తీసుకున్నాక, తర్వాత నెల బియ్యం కావాలంటే ఇచ్చేందుకు వీలుగా అధ్యయనం చేస్తున్నాం’ అని పౌర

Published : 21 Apr 2022 07:53 IST

ఇష్టపడితేనే నగదు బదిలీ.. కార్డుదారులపై ఒత్తిడి ఉండదు
ధర, ప్రారంభంపై త్వరలో నిర్ణయం

మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

ఈనాడు-అమరావతి: ‘కార్డుదారులు ఇష్టం మేరకు నగదు కానీ, బియ్యం కానీ తీసుకోవచ్చు. ఇందులో ఎటువంటి ఒత్తిడి ఉండదు. ఒక నెల నగదు తీసుకున్నాక, తర్వాత నెల బియ్యం కావాలంటే ఇచ్చేందుకు వీలుగా అధ్యయనం చేస్తున్నాం’ అని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘నగదు బదిలీని అమలు చేయాలని 2017లోనే కేంద్రం అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఇప్పటికే 5 కేంద్ర పాలిత ప్రాంతాల్లో దీనిని అమలు చేస్తున్నారు. ఆరోగ్యం దృష్ట్యా కొందరు జొన్నలు, రాగులు, ముడిబియ్యం వంటివి తింటున్నారు. రేషన్‌ బియ్యం బదులు నగదు తీసుకొని, వాటిని కొనుక్కునే వీలుంటుంది. ఎంత ధర అనేది ఇంకా ఖరారు కాలేదు. సీఎం వద్ద చర్చించి ధర నిర్ణయించాక రెండు, మూడు పురపాలికల్లో ప్రయోగాత్మకంగా ఎప్పటి నుంచి ప్రారంభిస్తామనేది ప్రకటిస్తాం. బియ్యం వద్దు, నగదు కావాలని సంతకం పెడితే కార్డు పోతుందని ప్రతిపక్షాలు చెబుతున్నది నిజం కాదు. ఎవరి కార్డ్డూ తీసేయరు. ఈ నగదు కూడా మహిళల ఖాతాల్లోనే జమ చేస్తాం. దీనిపై ప్రతిపక్షాలు పనిగట్టుకొని అపోహలు సృష్టించేందుకు చూస్తున్నాయి’ అని మంత్రి విమర్శించారు.

ముడిబియ్యం, జొన్నల కోసం అమ్ముతున్నారేమో?

రేషన్‌ బియ్యం లోడుతో కాకినాడ పోర్టుకు వెళ్తున్న లారీలు నిత్యం పట్టుబడుతూనే ఉన్నాయని విలేకరులు ప్రస్తావించగా.. ‘ముడిబియ్యం, జొన్నలు వంటివి కొనుగోలు చేసుకునేందుకు వాటిని అమ్ముకుంటున్నారేమో.. దీనిపై పరిశీలించి అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిస్తాం’ అని మంత్రి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని