సైలెన్సర్లపై రోడ్డు రోలర్‌!

శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న సైలెన్సర్లను విశాఖ పోలీసులు రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. ఇటీవల కొంత మంది తమ వాహనాల సైలెన్సర్లను అధిక శబ్దం వచ్చేలా

Published : 27 Jun 2022 04:29 IST

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న సైలెన్సర్లను విశాఖ పోలీసులు రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. ఇటీవల కొంత మంది తమ వాహనాల సైలెన్సర్లను అధిక శబ్దం వచ్చేలా మార్చుకుంటున్నారు. ఇలాంటి వాటిపై దృష్టి పెట్టిన పోలీసులు నెల రోజుల్లో 631 వాహనాలను సీజ్‌ చేశారు. వాటి సైలెన్సర్లు విప్పి ఆదివారం బీచ్‌ రోడ్డులో పోగేసి వాటి పైనుంచి రోడ్డు రోలర్‌ పోనిచ్చారు. మరోసారి వినియోగించడానికి వీల్లేకుండా తుక్కుకింద మార్చేశారు. ఈ కార్యక్రమాన్ని నగర సీపీ శ్రీకాంత్‌ పర్యవేక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని