అంగన్‌వాడీ మెనూ ఛార్జీల పెంపు

వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ కింద లబ్ధిదారులకు ఇచ్చే మెనూ ఛార్జీలను ఒక్కొక్కరికి రూ.2 నుంచి... రూ.5.77 చొప్పున ప్రభుత్వం పెంచిందని అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ పేర్కొన్నారు.

Published : 05 Jul 2022 05:15 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ కింద లబ్ధిదారులకు ఇచ్చే మెనూ ఛార్జీలను ఒక్కొక్కరికి రూ.2 నుంచి... రూ.5.77 చొప్పున ప్రభుత్వం పెంచిందని అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ పేర్కొన్నారు. నిర్వహణ ఖర్చుల కింద ఒక్కో కేంద్రానికి రూ.2 వేలు విడుదల చేసిందన్నారు. గుంటూరులోని కార్యాలయంలో అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులతో మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ సిరి సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కూరగాయలకు సంబంధించి ఒక నెల ముందుగానే కొంత మొత్తాన్ని అడ్వాన్స్‌గా చెల్లిస్తామని డైరెక్టర్‌ హామీ ఇచ్చినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలకు పెండింగ్‌లో ఉన్న విద్యుత్తు బిల్లులు, అద్దె బిల్లులు వెంటనే విడుదల చేస్తామని, పని ఒత్తిడి తగ్గిస్తామని, ఇతర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పినట్లు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని