తప్పు చేసిన ఎంపీని రక్షించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది: మహిళా ఐకాస

మహిళలను అవమానపరిచేలా, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించిన వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ను రాష్ట్ర ప్రభుత్వం, కొందరు పోలీసు అధికారులు రక్షించేందుకు

Published : 13 Aug 2022 03:39 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: మహిళలను అవమానపరిచేలా, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించిన వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ను రాష్ట్ర ప్రభుత్వం, కొందరు పోలీసు అధికారులు రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని అఖిలపక్ష మహిళా ఐకాస ప్రతినిధులు ధ్వజమెత్తారు. గోరంట్ల మాధవ్‌ నగ్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నా  ఆయనపై చర్యలు తీసుకోకపోవడాన్ని ఆక్షేపించారు. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. వీడియోను కేంద్ర ఫోరెన్సిక్‌ ప్రయోగశాలలో పరీక్షించాలని, సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేసేలా పోలీసు వ్యవస్థను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. ఎంపీ ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటని ఐకాస కన్వీనర్‌, సామాజిక కార్యకర్త డా.కీర్తి మండిపడ్డారు. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, కాంగ్రెస్‌ రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు దుర్గాభవాని, లోక్‌సత్తా రాష్ట్ర నాయకురాలు మాలతి, జనసేన నాయకురాలు సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని