దేశాభివృద్ధిలో తెలుగువారు ముందుండాలి: చంద్రబాబు

దేశాభివృద్ధిలో తెలుగువారు ఎప్పుడూ ముందుండాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చారని,

Updated : 14 Aug 2022 06:16 IST

ఈనాడు, హైదరాబాద్‌: దేశాభివృద్ధిలో తెలుగువారు ఎప్పుడూ ముందుండాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చారని, పింగళి వెంకయ్య జాతీయ జెండాను రూపొందించారని.. స్వాతంత్య్రానికి ముందు.. తరువాత తెలుగువారు దేశ నిర్మాణంలో కీలకపాత్ర పోషించారని ఆయన అన్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా శనివారం ఎన్టీఆర్‌ భవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటాలకు ఆయన నివాళులర్పించారు. అనంతరం పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ‘తెలుగు రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. దేశంలో నదుల అనుసంధానం జరగాలి. సాగునీటి కరవు పోవాలి. సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని ఆపి సద్వినియోగం చేసుకుంటే తెలుగు రాష్ట్రాలు సస్యశ్యామలమవుతాయి’’ అని చంద్రబాబు అన్నారు. తెదేపా తెలంగాణ అధ్యక్షుడు బక్కని నర్సింలు, ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌, పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని