జాతీయ కమిటీలో దళిత్‌ ఇండస్ట్రియల్‌ అసోసియేషన్‌కు భాగస్వామ్యం

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను తయారు చేయడానికి ఉద్దేశించిన జాతీయ ఎస్సీ, ఎస్టీ హబ్‌ పథకంలో భాగంగా ఏర్పాటైన అత్యున్నత స్థాయి కమిటీలో తెలుగు రాష్ట్రాల నుంచి దళిత్‌

Published : 17 Aug 2022 05:22 IST

ఈనాడు-అమరావతి: ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను తయారు చేయడానికి ఉద్దేశించిన జాతీయ ఎస్సీ, ఎస్టీ హబ్‌ పథకంలో భాగంగా ఏర్పాటైన అత్యున్నత స్థాయి కమిటీలో తెలుగు రాష్ట్రాల నుంచి దళిత్‌ ఇండస్ట్రియల్‌ అసోసియేషన్‌కు కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం కల్పించింది. ఈ కమిటీకి కేంద్ర సూక్ష్మ, చిన్న మధ్య తరగతి పరిశ్రమలశాఖ మంత్రి ఛైర్మన్‌గా ఉంటారు. నీతిఅయోగ్‌ సీఈవో, ఆర్బీఐ ఎగ్జిక్యూటీవ్‌ డైరక్టర్‌, సిడ్బీ సీఈవో, పలు శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. ఈ అత్యున్నత కమిటీలో దళిత్‌ ఇండస్ట్రియల్‌ అసోసియేషన్‌కు భాగస్వామ్యం కల్పించడం పట్ల అసోయేషన్‌ జాతీయ అధ్యక్షుడు మామిడి సుదర్శన్‌ సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను తయారు చేయడానికి మరింత ఉత్సాహంగా పని చేస్తామని ఆయన అన్నారు. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని