పాలారు నదిపై ఆనకట్టల నిర్మాణాలు ఆపాలి

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాలారు నదిపై నిర్మించ తలపెట్టిన ఆనకట్టల నిర్మాణాన్ని నిలిపేయాలని తమిళనాడు ప్రతిపక్ష నేత, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఆదివారం ఒక ప్రకటనలో

Published : 26 Sep 2022 04:38 IST

రాష్ట్ర ప్రభుత్వానికి పళనిస్వామి సూచన

చెన్నై, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాలారు నదిపై నిర్మించ తలపెట్టిన ఆనకట్టల నిర్మాణాన్ని నిలిపేయాలని తమిళనాడు ప్రతిపక్ష నేత, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ఏపీ చట్టవిరుద్ధంగా వీటిని నిర్మిస్తోందని పేర్కొన్నారు. ఏ రాష్ట్రమైనా ఆనకట్టలు నిర్మించేటప్పుడు సంబంధిత నది ప్రవహించే రాష్ట్రాల అంగీకారం తీసుకోవాలని గతంలో కోర్టు తీర్పునిచ్చిందని గుర్తుచేశారు. పాలారు నుంచి ఏడాదికి 40 టీఎంసీల నీరు తమిళనాడుకు దక్కాలనే ఒప్పందం ఉందని తెలిపారు. ఏపీ సీఎం జగన్‌ కుప్పం నియోజకవర్గంలో మాట్లాడుతూ.. తమిళనాడు సరిహద్దుల్లో చేపట్టనున్న ఆనకట్టల గురించి ప్రకటించారని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని