మొక్కై ‘వంగ’క.. మానై ఎదిగింది

వంగ తోటలో కాయలు తెంపాలంటే ఎవరైనా ఒళ్లు వంచాల్సిందే... అవే కాయలు అందనంత ఎత్తులో ఉంటే ఆశ్చర్యమే. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్లుకు చెందిన ఆకుల లీలావతి పెరట్లోని

Published : 28 Sep 2022 04:12 IST

వంగ తోటలో కాయలు తెంపాలంటే ఎవరైనా ఒళ్లు వంచాల్సిందే... అవే కాయలు అందనంత ఎత్తులో ఉంటే ఆశ్చర్యమే. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్లుకు చెందిన ఆకుల లీలావతి పెరట్లోని వంగ మొక్క ఏకంగా ఏడడుగులు పెరిగింది. ఇదేదో హైబ్రీడ్‌ మొక్క అనుకుంటే పొరపాటే. యాదృచ్ఛికంగా వేసిన విత్తనాల్లో ఒకటి ఇలా ఏపుగా ఎదిగింది. ప్రతినెలా అయిదు కిలోల కాయలు కూడా ఇస్తోంది. చెట్టుకు సరైన పోషకాలు అందితే ఇలా ఎదగడంతో పాటు దిగుబడులు కూడా ఇస్తాయని ఉద్యాన అధికారులు చెబుతున్నారు.

- ఈనాడు, అన్నమయ్య

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని