ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెటింగ్‌

ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన ఉత్పత్తులకు ‘ప్రొడ్యూసర్స్‌ ట్రస్ట్‌’ ద్వారా అంతర్జాతీయ విపణిలో మార్కెటింగ్‌ అవకాశాలు కల్పించనున్నట్లు రైతు సాధికార సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి బి.రామారావు తెలిపారు.

Published : 26 Jan 2023 05:00 IST

రైతు సాధికార సంస్థ సీఈఓ రామారావు

ఈనాడు, అమరావతి: ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన ఉత్పత్తులకు ‘ప్రొడ్యూసర్స్‌ ట్రస్ట్‌’ ద్వారా అంతర్జాతీయ విపణిలో మార్కెటింగ్‌ అవకాశాలు కల్పించనున్నట్లు రైతు సాధికార సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి బి.రామారావు తెలిపారు. రెండు రోజుల పాటు రాష్ట్రంలో ఈ సంస్థకు చెందిన బృందం పర్యటించి, ప్రకృతి వ్యవసాయ విధానాల అమలును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిందని వివరించారు. గుంటూరులో బుధవారం వివిధ ప్రాంతాలకు చెందిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తొలి విడతగా వరి, సెనగ, కాఫీ, పామోలిన్‌ ఎగుమతికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి ఉత్పత్తికి సంబంధించి రైతుల వివరాలను క్యూఆర్‌ కోడ్‌ ద్వారా తెలుసుకునే వీలుంటుందని చెప్పారు. సాగుకు అవసరమయ్యే నీరు, విద్యుత్తు, విడుదలయ్యే కర్బనశాతం, వాతావరణ కలుషితంపై ప్రభావం తదితరాలన్నీ అందులో ఉంటాయన్నారు. రాబోయే రెండు నెలల్లో 500 నుంచి 1,000 మంది రైతుల ప్రొఫైల్‌ సిద్ధం చేయాలని సిబ్బందికి రామారావు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని