Vande Bharat Express: ‘వందే భారత్‌’ వచ్చినప్పుడే కాపలానా?

రైల్వే గేట్ల వద్ద, పట్టాల మీదుగా ప్రజలు రాకపోకలు సాగించే ప్రాంతాల్లో పైవంతెనలు, అండర్‌ బ్రిడ్జిల నిర్మాణాలు చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు.

Updated : 30 Jan 2023 07:11 IST

రైల్వే గేట్ల వద్ద, పట్టాల మీదుగా ప్రజలు రాకపోకలు సాగించే ప్రాంతాల్లో పైవంతెనలు, అండర్‌ బ్రిడ్జిల నిర్మాణాలు చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. విజయవాడ మధురానగర్‌లో అండర్‌ బ్రిడ్జిని రైల్వేశాఖ మూడేళ్ల క్రితం పూర్తి చేసినా.. రాష్ట్ర ప్రభుత్వం అప్రోచ్‌ రోడ్లు పూర్తి చేయలేకపోతోంది. వాంబే కాలనీ నుంచి దేవీనగర్‌ వైపు రైల్వే ట్రాక్‌పై పైవంతెన నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదించినా ప్రస్తుత ప్రభుత్వం దీనిని పక్కనపెట్టేసింది. దీంతో రోజూ వేలాది మంది ప్రజలు పట్టాల మీద నుంచే ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం వందేభారత్‌ రైలు వేగాన్ని గుర్తించలేక ప్రజలు ప్రమాదాల బారినపడే అవకాశముంది. దీంతో విజయవాడలో రైల్వే పోలీసులే ఈ రైలు వచ్చివెళ్లే సమయంలో కాపలా ఉండి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మిగిలిన సమయాల్లో మాత్రం ఎవరూ ఉండడం లేదు. 

ఈనాడు, అమరావతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని