ఉపాధి అవకాశాలు లేకే వలసలు

కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు లేకనే ఏటా వ్యవసాయ కూలీలు వలస వెళ్తున్నారని మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు చెప్పారు.

Published : 31 Jan 2023 03:15 IST

మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు

ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు లేకనే ఏటా వ్యవసాయ కూలీలు వలస వెళ్తున్నారని మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు చెప్పారు. ఆదోని డివిజన్‌లోని కోస్గి, కౌతాళం, పెద్దకడబూరు మండలాల్లో మానవ హక్కుల వేదికతో పాటు, ఆయకట్టు రైతు సంఘం, రైతు కూలీ సంఘం, ఐఎఫ్‌టీయూ నాయకులు... గ్రామాల్లో పర్యటించి, వలసలపై 3 రోజుల పాటు విచారణ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ... కోస్గి మండలం చింతకుంట, పల్లెపాడు, డి.బెళగల్‌, కౌతాళం మండలం మదిరె, పోదలకుంట, సుళేకేరి, పెద్దకడబూరు మండలంలో గవిగట్టు గ్రామాల్ని సందర్శించామన్నారు. సాగునీటి వనరులు పూర్తి స్థాయిలో లేకపోవడంతో 90 శాతం మంది రైతులు వర్షాలపై ఆధారపడ్డారని, నకిలీ విత్తనాలతో ఎంతోమంది నష్టపోయారని తెలిపారు. ఆర్‌డీఎస్‌ కుడి కాల్వ నిర్మాణం పూర్తికాలేదని, ఉపాధి పనులు గిట్టుబాటు కావడం లేదని చెప్పారు. ఉపాధి పథకం వేతనాలు పెండింగ్‌లో ఉండటంతో రైతులు, కూలీలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పశ్చిమ ప్రాంతంలో సాగు, తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని