గ్రామ సచివాలయంలో జడ్పీటీసీ కుమారుడి వీరంగం

గుంటూరు జిల్లా పెదకాకానిలోని గ్రామ సచివాలయ సిబ్బందిపై స్థానిక వైకాపా జడ్పీటీసీ సభ్యురాలు గోళ్ల జ్యోతి కుమారుడు కమల్‌ దాడికి యత్నించిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది.

Published : 31 Jan 2023 05:05 IST

పెదకాకాని, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా పెదకాకానిలోని గ్రామ సచివాలయ సిబ్బందిపై స్థానిక వైకాపా జడ్పీటీసీ సభ్యురాలు గోళ్ల జ్యోతి కుమారుడు కమల్‌ దాడికి యత్నించిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెదకాకానిలోని గ్రామ సచివాలయం-5 పరిధిలో ఇటీవల నిర్మించిన హెల్త్‌ క్లినిక్‌ బిల్లులు, ఆర్బీకే కోసం తామిచ్చిన భవనానికి అద్దె ఇవ్వాలంటూ కమల్‌ సచివాలయ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారు. పక్కనున్న ఒప్పంద ఉద్యోగులు ఆయనను సముదాయించేందుకు ప్రయత్నించగా వారిపై దాడి చేశారు. ఇద్దరు మహిళా సిబ్బందిపై అసభ్య వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రవర్తనతో భయాందోళనకు గురైన సిబ్బంది ఓ గదిలోకి పరుగులు తీసి తలుపులు వేసుకున్నారు. గతంలో ఆయన ఇలాగే ప్రవర్తించారని వారు తెలిపారు. మద్యం మత్తులో కమల్‌ వీరంగం వేశారని, చర్యలు చేపట్టాలంటూ గ్రామ సచివాలయ సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని