గర్భిణులకు ఉచితంగా టిఫా స్కానింగ్‌

తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణ చర్యల్లో భాగంగా గర్భిణులకు కొత్తగా ఉచితంగా ‘టిఫా’ (టార్గెటెడ్‌ ఇమేజింగ్‌ ఫర్‌ ఫీటల్‌ ఎనామలిటీస్‌) స్కానింగ్‌ సౌకర్యాన్ని అందుబాటులో తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు వెల్లడించారు.

Updated : 03 Feb 2023 06:01 IST

వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు

ఈనాడు, అమరావతి: తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణ చర్యల్లో భాగంగా గర్భిణులకు కొత్తగా ఉచితంగా ‘టిఫా’ (టార్గెటెడ్‌ ఇమేజింగ్‌ ఫర్‌ ఫీటల్‌ ఎనామలిటీస్‌) స్కానింగ్‌ సౌకర్యాన్ని అందుబాటులో తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు వెల్లడించారు. ఈ స్కానింగ్‌ ద్వారా గర్భస్థ శిశువుల లోపాలను గుర్తించి, ముందుగానే జాగ్రత్తపడేందుకు వీలవుతుందని తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో రేడియాలజిస్టులు ఉన్నచోట ఈ టిఫా స్కానింగ్‌ సేవలను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రుల్లో ఈ సౌకర్యం త్వరలోనే వస్తుందన్నారు. విజయవాడలోని బోధనాసుపత్రిలో గురువారం సాయంత్రం ఆయన విలేకర్లతో మాట్లాడారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు