పయ్యావులకు భద్రత తొలగింపుపై కౌంటర్‌ వేయండి

రాష్ట్ర ప్రభుత్వం తనకు భద్రతను తొలగించడాన్ని సవాలుచేస్తూ తెదేపా సీనియర్‌ నేత, ప్రజాపద్దుల సంఘం ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది.

Updated : 08 Feb 2023 05:13 IST

ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం తనకు భద్రతను తొలగించడాన్ని సవాలుచేస్తూ తెదేపా సీనియర్‌ నేత, ప్రజాపద్దుల సంఘం ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ వేయాలని ప్రతివాదులను ఆదేశించింది. హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, నిఘా అదనపు డీజీ, ఐజీ, అనంతపురం ఎస్పీ, ఐబీ డిప్యూటీ డైరెక్టర్‌, రాష్ట్రస్థాయి భద్రతా సమీక్ష కమిటీకి నోటీసులు జారీచేసింది. న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి మంగళవారం ఈ ఆదేశాలిచ్చారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ‘పిటిషనర్‌ కేశవ్‌కు నక్సల్స్‌ నుంచి ముప్పు ఉందన్న కారణంగా 1994 నుంచి భద్రత కల్పిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2+2గా ఉన్న భద్రతను 1+1కి కుదించింది. గతేడాది జులై నుంచి పూర్తిగా తొలగించింది’ అని వాదించారు. ప్రభుత్వ సహాయ న్యాయవాది వాదిస్తూ వ్యక్తిగత భద్రతాధికారిని మార్చామన్న కారణంగా మరో భద్రతా సిబ్బందిని పిటిషనరే వెనక్కి పంపించారు, ప్రభుత్వం తొలగించిందన్న వాదన సరికాదని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని