జనజాగరణ సమితి కన్వీనర్‌ వాసును విచారించిన పోలీసులు

ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వద్ద ‘సి.ఎం. గోబ్యాక్‌, బిల్డ్‌ అమరావతి’ పేరుతో పోస్టర్లను ఏర్పాటు చేసిన ఘటనలో జనజాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్‌ వాసును మూడో పట్టణ పోలీసులు విచారించారు.

Published : 20 Mar 2023 03:49 IST

విశాఖపట్నం (ఎం.వి.పి.కాలనీ), న్యూస్‌టుడే: ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వద్ద ‘సి.ఎం. గోబ్యాక్‌, బిల్డ్‌ అమరావతి’ పేరుతో పోస్టర్లను ఏర్పాటు చేసిన ఘటనలో జనజాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్‌ వాసును మూడో పట్టణ పోలీసులు విచారించారు. ఆయనపై కేసు నమోదైన నేపథ్యంలో వాసు శనివారం సాయంత్రం విశాఖ 3వ పట్టణ పోలీసుస్టేషన్‌లో లొంగిపోయిన సంగతి తెలిసిందే. వాసుతో పాటు ముగ్గురిని ప్రశ్నించారు.

* ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు విశాఖ పరిపాలన రాజధాని పేరుతో ఉత్తరాంధ్రుల భావోద్వేగాలను వాడుకుని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని జనజాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్‌ వాసు ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. గత నాలుగేళ్లలో ఉత్తరాంధ్రను ఏమి ఉద్ధరించారని విశాఖ నుంచి పరిపాలన చేయనున్నట్లు ప్రకటించారని ప్రశ్నించారు. జగన్‌ ఇకనైనా మూడు రాజధానులపై వెనక్కి తగ్గాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని