ఐనవోలు మల్లన్నకు పెద్ద పట్నం

హనుమకొండ జిల్లాలోని ఐనవోలు మల్లన్న క్షేత్రంలో ఆదివారం పెద్ద పట్నం వేశారు.

Updated : 20 Mar 2023 05:29 IST

హనుమకొండ జిల్లాలోని ఐనవోలు మల్లన్న క్షేత్రంలో ఆదివారం పెద్ద పట్నం వేశారు. సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరిగే జాతర ఉత్సవాల్లో భాగంగా చివరి ఆదివారం మల్లన్న కల్యాణం, పెద్ద పట్నం వేయడం ఆనవాయితీ. ఈ ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దేవస్థాన ప్రాంగణంలోని నటరాజ విగ్రహం ఎదురుగా 4 గంటల పాటు శ్రమించి 20 అడుగుల పొడవు, వెడల్పుతో ఒగ్గు పూజారులు వేసిన పెద్ద పట్నం భక్తులకు కనువిందు చేసింది. ఉత్సవమూర్తులతో 5 ప్రదక్షిణలు చేసి పట్నంలోకి వేలుకొల్పి పూజలు చేసి నైవేద్యం సమర్పించారు.

న్యూస్‌టుడే, ఐనవోలు(హనుమకొండ)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు