‘నాడు-నేడు’ పూర్తయ్యేనా.. చదువులు చక్కబడేనా!

ఈ చిత్రంలో కనిపిస్తున్నది విజయవాడ దుర్గాపురం శ్రీ టి.వెంకటేశ్వరరావు నగరపాలకసంస్థ పాఠశాల. ఇక్కడ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ‘నాడు-నేడు’ పనులు కొనసా..గుతూనే ఉన్నాయి.

Published : 30 May 2023 05:18 IST

ఈనాడు, అమరావతి: ఈ చిత్రంలో కనిపిస్తున్నది విజయవాడ దుర్గాపురం శ్రీ టి.వెంకటేశ్వరరావు నగరపాలకసంస్థ పాఠశాల. ఇక్కడ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ‘నాడు-నేడు’ పనులు కొనసా..గుతూనే ఉన్నాయి. ఈ నిర్మాణాల కారణంగా విద్యార్థులకు సరిపడా గదులు అందుబాటులో లేక.. గత ఏడాది అక్టోబరు నుంచి విద్యాసంవత్సరం ముగిసే వరకూ ఒంటిపూట బడులే నిర్వహించాల్సి వచ్చింది.

దీంతో చదువు సరిగ్గా సాగక పిల్లలు వెనుకబడిపోతున్నారని, ఇలా అయితే పిల్లలను వేరొక పాఠశాలలో వేసుకుంటామని విద్యాసంవత్సరం చివరిరోజు తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు మూకుమ్మడిగా తెలిపారు. అయినా ఇప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. అదనపు గదుల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. జూన్‌లో విద్యాసంవత్సరం ప్రారంభానికి కాదు కదా.. ఏడాది పూర్తయ్యేనాటికి కూడా కొలిక్కి వచ్చేలా లేవు. కరోనాతో రెండేళ్లు చదువులు సరిగా సాగలేదని, గదుల కొరతతో ఈ ఏడాది కూడా ఒంటిపూట బడులే నిర్వహిస్తే పిల్లలు నష్టపోతారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. నిర్మాణాలు త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని