Yuvagalam: ఏఐ యాంకర్‌తో ‘యువగళం’ వార్తలు

వార్తలు చదివే కృత్రిమ మేథ (ఏఐ) యాంకర్‌ను ఐ-టీడీపీ, కనిగిరి విభాగం రూపొందించింది. అంతేకాకుండా దానికి వైభవి అనే పేరునూ పెట్టింది. తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర సమాచారాన్ని ఈ యాంకర్‌తో చదివించారు.

Updated : 20 Jul 2023 07:42 IST

ఐ-టీడీపీ కనిగిరి విభాగం ప్రయోగం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వార్తలు చదివే కృత్రిమ మేథ (ఏఐ) యాంకర్‌ను ఐ-టీడీపీ, కనిగిరి విభాగం రూపొందించింది. అంతేకాకుండా దానికి వైభవి అనే పేరునూ పెట్టింది. తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర సమాచారాన్ని ఈ యాంకర్‌తో చదివించారు. ఈ మేరకు కనిగిరిలో పాదయాత్ర షెడ్యూల్‌ వివరాల్ని వైభవి వెల్లడిస్తున్న వీడియోను బుధవారం విడుదల చేశారు. సుమారు 1.40 నిమిషాలు ఉన్న ఈ వీడియోలో పాదయాత్ర సాగే గ్రామాలు, కార్యక్రమాల వివరాలు ఉన్నాయి. ఏఐ పరిజ్ఞానాన్ని ఉపయోగించిన తొలి పార్టీ తెదేపానేనని, పార్టీ కార్యక్రమాలు, మేనిఫెస్టోను ప్రజల్లోకి పంపేందుకు ప్రయత్నించనున్నట్లు ఐ-టీడీపీ కనిగిరి విభాగం వెల్లడించింది.

చదువుల తల్లికి వందనం

అనంతపురం జిల్లా శింగనమల మండలం నాగులగుడ్డం అనే మారుమూల పల్లెకు చెందిన భారతి.. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకోవడం గురించి ఈనాడులో వచ్చిన వార్తపై నారా లోకేశ్‌ స్పందించారు. ‘చదువుల తల్లి మీకు వందనం. మీ పట్టుదల ఎందరికో ఆదర్శం. కూలిపనులు చేస్తూనే పీహెచ్‌డీ సాధించిన డా.సాకే భారతికి శుభాభినందనలు’ అని బుధవారం ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని