అరచేతిలో ప్రాణం.. పెద్దేరులో ప్రయాణం

ఏరు దాటాలంటే వంతెన మీదుగా వెళ్తాం. లేకపోతే పడవలు, తెప్పలను ఆశ్రయిస్తాం. కానీ ఇక్కడ వంతెన అంశాన్ని పాలకులు ప్రతిసారి ఎన్నికల హామీగా మలుచుకుంటున్నారు.

Updated : 18 Nov 2023 06:02 IST

ఏరు దాటాలంటే వంతెన మీదుగా వెళ్తాం. లేకపోతే పడవలు, తెప్పలను ఆశ్రయిస్తాం. కానీ ఇక్కడ వంతెన అంశాన్ని పాలకులు ప్రతిసారి ఎన్నికల హామీగా మలుచుకుంటున్నారు. పడవలు ఆ ప్రజలకు అందుబాటులో లేవు. అందుకే.. బెల్లం తయారీకి వాడే పాత్రను తెప్పగా చేసుకొని ఏరు దాటుతున్నారు. ఇదీ అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలో పలు గ్రామాల రైతుల పరిస్థితి. ఈ మండలం మీదుగా పెద్దేరు ప్రవహిస్తుంది. ఏడాది పొడవునా నిండుగా పారుతుంది. చాకిపల్లి, రామజోగిపాలెం, జన్నవరం గ్రామాల రైతుల భూములు పెద్దేరుకు అవతలి వైపు ఉన్నాయి. పొలాలకు వెళ్లాలంటే బెల్లం తయారీకి వాడే పాత్ర(పెనం)ను తెప్పగా చేసుకుంటున్నారు. ఆ పాత్ర ఇనుముతో చేసింది కావడంతో బరువు ఎక్కువగా ఉంటోంది. పొరపాటున ఒక వైపు బరువు ఎక్కువైతే మునిగిపోతుంది. అందుకే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని.. పెద్దేరును దాటుతున్నారు. రామజోగిపాలెం గ్రామానికి చెందిన తల్లీకుమార్తె పెద్దేరు దాటుతున్న దృశ్యమిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని