ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు

ఉత్తర కోస్తాలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Updated : 19 Mar 2024 08:01 IST

ఈనాడు-అమరావతి, ఈనాడు డిజిటల్‌-విశాఖపట్నం: ఉత్తర కోస్తాలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘దక్షిణ తమిళనాడు నుంచి అంతర్గత కర్ణాటక మీదుగా.. పశ్చిమ విదర్భ, పొరుగు ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు ఒక ద్రోణి విస్తరించి ఉంది. ఝార్ఖండ్‌ నుంచి ఒడిశా మీదుగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా వరకు మరో ద్రోణి వ్యాపించింది. వీటి ప్రభావంతో బుధవారం అల్లూరి సీతారామరాజు, డా.బీఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్‌, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని