మద్యం కాదు.. మంచినీళ్లతో గొంతు తడపండి!

ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కొందరు అభ్యర్థుల వెంట వెళ్తే చాలు.. తాగినంత మద్యం పోయిస్తున్నారు.

Published : 30 Apr 2024 05:14 IST

బొల్లాపల్లి, వినుకొండ, న్యూస్‌టుడే : ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కొందరు అభ్యర్థుల వెంట వెళ్తే చాలు.. తాగినంత మద్యం పోయిస్తున్నారు. ఎండాకాలంలో గ్రామాల్లో నీళ్లు దొరకకున్నా.. మద్యానికి లోటు ఉండటం లేదు. ఈ స్థితి గమనించిన పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం గుమ్మనంపాడు గ్రామవాసులు అభ్యర్థులకు వాట్సప్‌లో చురకలు వేస్తున్నారు. ‘వచ్చిన అభ్యర్థులంతా వరికపూడిశెల ప్రాజెక్టు గురించే మాట్లాడుతున్నారు. మాటలు కాదు. మీకు ఓట్లు కావాలంటే.. మాకు తాగు, సాగు నీరు ఇవ్వండి’ అని వరికపూడిశెల సాధన సమితి సభ్యులు వాట్సప్‌లో ప్రచారం చేస్తున్నారు.

గండిగనుమల, షోలాయిపాలెం, అయ్యన్నపాలెం, చక్రాయపాలెం, గుమ్మనంపాడు, రావులాపురం, గుట్లపల్లి, కండ్రిక, బండ్లమోటు దిగువ గ్రామాల్లో నీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది. ప్రైవేటు ట్యాంకర్ల నుంచి డ్రమ్ము నీళ్లు రూ.100కు కొంటున్నారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం.. తాగడానికి ఒక్కరికి రోజుకు 15లీటర్ల వంతున లెక్కకట్టి రేషన్‌ పద్ధతి పాటిస్తోంది. మండలంలోని డజనుకు పైగా గ్రామాల్లో నీటి సమస్య ఉంటే.. మూడు ఊర్లకు మాత్రమే ట్యాంకర్లతో నీళ్లు పోస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని