మున్ముందూ ఆన్‌లైన్‌ ఆర్డర్లలో వృద్ధి

కొవిడ్‌-19 కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో చాలా రాష్ట్రాలు పాక్షిక లేదా సంపూర్ణ లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించే అవకాశం ఉండటంతో మున్ముందూ ఆన్‌లైన్‌ ఆర్డర్లలో వృద్ధి కొనసాగుతుందని సత్వర సేవల రెస్టారెంటు సంస్థలు కేఎఫ్‌సీ, మెక్‌డొనాల్డ్‌, టాకో బెల్‌ ఆశాభావం వ్యక్తం చేశాయి.

Published : 21 Apr 2021 01:09 IST

కేఎఫ్‌సీ, మెక్‌డొనాల్డ్‌ ఆశాభావం

దిల్లీ: కొవిడ్‌-19 కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో చాలా రాష్ట్రాలు పాక్షిక లేదా సంపూర్ణ లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించే అవకాశం ఉండటంతో మున్ముందూ ఆన్‌లైన్‌ ఆర్డర్లలో వృద్ధి కొనసాగుతుందని సత్వర సేవల రెస్టారెంటు సంస్థలు కేఎఫ్‌సీ, మెక్‌డొనాల్డ్‌, టాకో బెల్‌ ఆశాభావం వ్యక్తం చేశాయి. ఆర్డర్లు తీసుకోవడం, సరఫరా, రెస్టారెంట్లలో సేవలు.. ఇలా అన్ని విషయాల్లోనూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న మార్గదర్శకాలకు అనుగుణంగా జాగ్రత్తలు పాటిస్తున్నట్లు ఈ సంస్థలు వివరించాయి. ‘గతేడాది కరోనా నేపథ్యంలో చాలా మంది వినియోగదార్లు రెస్టారెంట్లకు రావడం కంటే ఇంటి వద్దకే ఆహార పదార్థాలను తెప్పించుకోవడాన్ని ప్రారంభించారు. ఇప్పుడు కొవిడ్‌-19 రెండో దశ వ్యాప్తితో మున్ముందు కూడా ఆన్‌లైన్‌ ఆర్డర్లలో వృద్ధి ఉంటుందని అనుకుంటున్నామ’ని కేఎఫ్‌సీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. కొవిడ్‌-19 జాగ్రత్తలను తప్పనిసరిగా పాటిస్తూ వినియోగదారులకు సేవలు అందించడానికి కట్టుబడి ఉన్నామని మెక్‌డొనాల్డ్‌ ఇండియా వెల్లడించింది. ఆయా రాష్ట్రాల మార్గదర్శకాలకు అనుగుణంగా తగు జాగ్రత్తలు పాటిస్తూ సేవలు కొనసాగిస్తామని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని