MG Astor: భారత మార్కెట్లోకి ఎంజీ ఆస్టర్

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎంజీ మోటార్స్‌ ఇండియా భారత్‌లో సరికొత్త కారు ఆస్టర్‌ కాంపాక్ట్‌ ఎస్‌యూవీని విడుదల చేసింది. ఈ కారు ఎక్స్‌షోరూమ్‌ ప్రారంభ వేరియంట్‌ ధర రూ.9.78 లక్షలుగా నిర్ణయించారు. వీటీఐ టెక్‌ మాన్యూవల్‌ ట్రిమ్‌ ధర మాత్రం అత్యధికంగా రూ.16.78 లక్షలు. ఈ కారు వీఐపీ టెక్‌ షార్ప్‌ సీవీటీ వేరియంట్‌, 220 షార్ప్‌ ఏటీ వేరియంట్‌లో 2ఏడీఏఎస్‌ భద్రతా ప్రమాణాలు అందుబాటోకి తీసుకొచ్చింది. ఎంజీ మోటార్స్‌ భారత్‌లో అందుబాటులోకి తీసుకొచ్చిన ఐదో కారు ఇది. ఎంజీ నుంచి కృత్రిమ మేధకు సంబంధించిన పర్సనల్‌ అసిస్టెన్స్‌, ఏడీఏఎస్‌ లెవల్‌-2 అటానమస్‌ సాంకేతికతతో వచ్చి తొలికారు ఇదే.ఈ కారు చూడటానికి ఎంజీ జెడ్‌ఎస్‌ ఈవీని తలపిస్తుంది. స్పైసీ ఆరెంజ్‌,అరోరా సిల్వర్‌,గ్లాజా రెడ్‌, క్యాండీ వైట్‌, స్టారీ బ్లాక్‌ రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. 17 అంగుళాల డ్యుయల్‌ టోన్‌ అలాయ్‌ వీల్స్‌ ఉన్నాయి. ముందు భాగంలో ఉండే గ్రిల్‌ ఆకారాన్ని మాత్రం ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు.

* కారు లోపలి భాగాన్ని రెండు రంగుల థీమ్‌తో రూపొందించారు. 7 అంగుళాల డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, 10.1 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ వ్యవస్థ ఉంది. ఆండ్రాయిడ్‌ ఆటో, యాపిల్‌ కార్‌ప్లేతో ఆపరేట్‌ చేయొచ్చు. ఎలక్ట్రిక్‌ కార్‌ పార్కింగ్‌ బ్రేక్‌, రేర్‌ ఏసీ వెంట్స్‌, రెయిన్‌ సెన్సింగ్‌ వైపర్స్‌, డిజిటల్‌ కీ, 360 డిగ్రీ కెమేరా, ఎయిర్‌ ప్యూరిఫైయర్‌, పనోరమిక్‌ సన్‌రూఫ్‌ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. 

* ఇంజిన్‌ విషయానికి వస్తే రెండు ఆప్షన్లు ఇచ్చారు. వీటిల్లో 1.4 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ 138 బీహెచ్‌పీ శక్తిని, 220 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. సిక్స్‌స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ను అమర్చారు. 1.5 లీటర్‌ ఫోర్‌ సిలిండర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌కు మ్యాన్యూవల్‌ లేదా 8స్పీడ్‌ సీవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. 

* ఇందులో పొందుపరిచిన అడ్వాన్స్‌డ్‌ డ్రైవింగ్‌ టెక్నాలజీ దీని ప్రత్యేకతను చాటుతోంది. యాపిల్‌ సిరి, అమెజాన్‌ అలెక్సా వలే పనిచేసే పర్సనల్‌ ఆర్టీఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సిస్టం, అటానమస్‌ లెవెల్‌-2 సాంకేతికత దీనికి మాత్రమే సొంతం. మ్యూజిక్‌ ప్లే, ఫోన్‌ కాల్స్‌ అటెండ్‌, సందేశాలు పంపడం వంటి పనులను వాయిస్‌ కమాండ్స్‌ ద్వారా చేయొచ్చు. కారులో కృత్రిమ మేధ వ్యవస్థ 35 హింగ్లిష్‌ వాయిస్‌ కమాండ్స్‌ను గుర్తించి పనిచేయగలదు. 

* ఎంజీ ఐ-స్మార్ట్‌ సాంకేతికత ద్వారా మరో 80కి పైగా ఇంటర్నెట్‌ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. దీనిలో వికీపీడియా, జోక్స్‌, న్యూస్‌, ఫెస్టివల్‌ జిఫ్‌, నావిగేషన్‌,ఆన్‌లైన్‌ మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌, కార్‌ కంట్రోల్‌, క్రిటికల్‌ ఇన్‌ కార్‌ వార్నింగ్‌ వంటి సేవలు అందుబాటులోకి వచ్చాయి. మ్యాప్‌మైఇండియా, జియో కనెక్టివిటీ వంటి సబ్‌స్క్రిప్షన్‌ సేవల్ని కూడా పొందొచ్చు.

* అత్యాధునిక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. రోడ్డుపై ఒకే వరుసలో వెళ్లేలా లేక్‌ కీప్ అసిస్ట్‌, లేన్‌ ఛేంజ్‌ అసిస్ట్‌, ఫ్రంట్‌ కొలిజన్‌ అలర్ట్‌, రేర్‌ క్రాస్‌ ట్రాఫిక్‌ అలర్ట్‌, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని