Mahindra: మహీంద్రా బంపర్‌ డిస్కౌంట్లు..!

దేశీయ కార్ల తయారీ దిగ్గజం మహీంద్రా సంస్థ భారీ డిస్కౌంట్లకు తెరతీసింది. అన్ని మోడల్స్‌పై ఇవి వర్తిస్తాయని ప్రకటించింది. అత్యల్పంగా రూ.16,500 నుంచి అత్యధికంగా రూ.3,01లక్షల

Published : 21 Jun 2021 23:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ కార్ల తయారీ దిగ్గజం మహీంద్రా సంస్థ భారీ డిస్కౌంట్లకు తెరతీసింది. అన్ని మోడల్స్‌పై ఇవి వర్తిస్తాయని ప్రకటించింది. అత్యల్పంగా రూ.16,500 నుంచి అత్యధికంగా రూ.3,01లక్షల వరకు డిస్కౌంట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్లు జూన్‌ 30 వరకు వర్తిస్తాయని పేర్కొన్నారు. ఆఫర్లలో డీలర్‌షిప్‌లను బట్టి స్వల్ప వ్యత్యాసాలు ఉంటాయని తెలిపింది. 
* ఫ్లాగ్‌షిప్‌ కారు ఆల్టురస్‌పై మొత్తం రూ.3.01 లక్షల డిస్కౌంట్‌ ఇవ్వనుంది. దీనిలో రూ.2.2లక్షలు నగదు డిస్కౌంట్‌, రూ.50వేలు ఎక్స్‌ఛేంజి బోనస్‌ ఉన్నాయి. ఇతర ఆఫర్లు కూడా కలుపుకొంటే రూ.3.01లక్షలు డిస్కౌంట్‌ లభిస్తుంది. 

* మహీంద్రా కేయూవీ 100 ఎన్‌ఎక్స్‌టీ పై మొత్తం రూ.61,055 వరకు డిస్కౌంట్లు ఇవ్వనున్నారు. దీనిలో క్యాష్‌ డిస్కౌంట్‌ రూ.38,055 కాగా.. ఎక్స్‌ఛేంజి బోనస్‌ రూ.20,000, కార్పొరేట్‌ డిస్కౌంట్‌ రూ.3,000 ఉన్నాయి. 

* ఎక్స్‌యూవీ 300పై అత్యధికంగా రూ.44,000 డిస్కౌంట్‌ లభిస్తుంది. దీనిలో నగదు రూపంలో రూ.5,000, ఎక్స్‌ఛేంజి బోనస్‌ రూ.25,000, కార్పోరేట్‌ డిస్కౌంట్‌ రూ.4వేలు, అదనపు లబ్ధిల రూపంలో రూ.10 వేలు లభించనున్నాయి. 

* మహీంద్రా మారజూపై అత్యధికంగా మొత్తం రూ.40,200 డిస్కౌంట్‌ లభిస్తుండగా.. దీనిలో క్యాష్‌ రూపంలో రూ.20 వేలు లభిస్తున్నాయి. ఎక్స్‌ఛేంజి బోనస్‌ రూ.15,000, కార్పొరేట్‌ ఆఫర్‌ కింద రూ.5,200 లభిస్తున్నాయి. 

* స్కార్పియోపై మొత్తం రూ.36,042 డిస్కౌంట్‌ ఇస్తున్నారు. దీనిలో నగదు డిస్కౌంట్‌ లేదు. 
* మహీంద్రా ఎక్స్‌యూవీ 500పై అత్యధికంగా మొత్తం రూ.1.89లక్షల వరకు నగదు డిస్కౌంట్‌ లభిస్తుంది. నగదు రూపంలో రూ.1.13లక్షలు, ఎక్స్‌ఛేంజి బోనస్‌ రూపంలో రూ.50 వేలు, వివిధ డిస్కౌంట్ల రూపంలో మిగిలిన మొత్తం లభిస్తోంది. బొలేరోపై మొత్తం రూ.16,500 వరకు డిస్కౌంట్‌గా లభించనుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని