Work From Home: 3 రోజులు ఆఫీసులకొచ్చేస్తాం..వర్క్‌ ఫ్రమ్‌ హోంపై ఉద్యోగులు

ఇంటి నుంచి పనికి ముగింపు పలికి కార్యాలయాలకు రావడానికి ఉద్యోగులు ఆసక్తి వ్యక్తం చేస్తున్నారని ఓ ప్రముఖ సర్వేలో తేలింది. కంపెనీలు సైతం ఉద్యోగులను ఆహ్వానించేందుకు సిద్ధమవుతున్నాయి....

Published : 01 Nov 2021 21:46 IST

హైబ్రిడ్‌ మోడల్‌ వర్కింగ్‌ విధానంపై కంపెనీల ఆసక్తి

దిల్లీ: ‘ఇంటి నుంచి పని’కి ముగింపు పలికి కార్యాలయాలకు రావడానికి ఉద్యోగులు ఆసక్తి వ్యక్తం చేస్తున్నారని ఓ ప్రముఖ సర్వేలో తేలింది. కంపెనీలు సైతం ఉద్యోగులను ఆహ్వానించేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే, వారంలో మూడు రోజులు ఆఫీసులో.. మిగిలిన పనిదినాలు ఇంటి నుంచి పనిచేసేయడం వైపు ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు. దీన్ని ‘హైబ్రిడ్‌ వర్క్‌ మోడల్‌’గా పేర్కొంటున్న విషయం తెలిసిందే. దాదాపు 70 శాతం కంపెనీలు ఈ విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ‘రిటర్న్‌ టు వర్క్‌ప్లేస్‌’ పేరిట నాస్కామ్‌, ఇండీడ్‌ సంస్థలు నిర్వహించిన సర్వేలో తేలింది.

సర్వేలోని ఇతర కీలకాంశాలు... 

ముందుగా ఐటీ సేవలు, ‘గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు(జీసీసీ)’ హైబ్రిడ్‌ వర్క్‌ మోడల్‌ వైపు మొగ్గుచూపే అవకాశం ఉంది. 

అలాగే 25 ఏళ్ల లోపు, 40 ఏళ్లు పైబడిన వారు ఆఫీసుకి రావడానికి ఆసక్తిగా ఉన్నారు. ఆఫీసులు తెరవాలనుకున్నప్పుడు ఉద్యోగుల ఆరోగ్య భద్రతకే తొలి ప్రాధాన్యమిస్తామని 81 శాతం కంపెనీలు తెలిపాయి. వచ్చే ఏడాది నుంచి 50 శాతం సిబ్బందితో కార్యాలయాలు తెరుస్తామని 72 శాతం కంపెనీలు పేర్కొన్నాయి.

​​​​​​​ మహిళా ఉద్యోగులు సైతం తిరిగి కార్యాలయాలకు రావడానికి ఉత్సాహంగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని