స్వల్పంగా తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

గురువారం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్వల్పంగా తగ్గాయి. పెట్రోల్‌పై లీటరుకు 16 పైసలు, డీజిల్‌ 14 పైసలు తగ్గింది. వరుసగా

Published : 15 Apr 2021 18:12 IST

న్యూదిల్లీ: గురువారం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్వల్పంగా తగ్గాయి. పెట్రోల్‌పై లీటరుకు 16 పైసలు, డీజిల్‌ 14 పైసలు తగ్గింది. వరుసగా ఆరు నెలల పాటు పెరుగుతూ వచ్చిన చమురు ధరలు ఇటీవల కాలంలో స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. గత మూడు వారాల్లో ఇలా తగ్గడం ఇది నాలుగోసారి. ప్రస్తుతం దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.90.40 ఉండగా, డీజిల్‌ ధర రూ.80.79గా ఉంది. తగ్గిన ధరలు దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. రాష్ట్రాలు విధించే పన్నులు ఆధారంగా ధరల్లో స్వల్ప మార్పు ఉంటుంది. ఆరు నెలల పాటు వరుసగా పెట్రోల్‌ ధరలు పెరగ్గా, ఈ ఏడాది మార్చి 24 నుంచి స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. కాగా, తాజా తగ్గింపుతో పెట్రోల్‌పై 67 పైసలు, డీజిల్‌పై 74పైసల భారం తగ్గింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని