ఎస్‌బీఐ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతా వ‌డ్డీ రేట్లు, ఉచిత లావాదేవీలు, ఇతర వివరాలు

ఎస్‌బీఐ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతా నుంచి నెలలో గరిష్టంగా 4 నగదు ఉపసంహరణలను ఉచితంగా అనుమతిస్తుంది

Published : 16 Apr 2021 16:26 IST

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (బీఎస్‌బీడీ) ఖాతాను జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతా అని పిలుస్తారు, ఇది ఒక‌ పొదుపు  ఖాతా, కొన్ని కనీస సౌకర్యాలను ఉచితంగా వినియోగ‌దారుల‌కు అందిస్తుంది. ఇటువంటి ఖాతాలు ప్రధానంగా ఆర్థికంగా వెన‌క‌ప‌డిన‌వారిని ప్రోత్స‌హించ‌డానికి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. 

4 ఉచిత లావాదేవీలకు మించి బీఎస్‌బీడీ ఖాతాల్లోని డిజిటల్ లావాదేవీలపై వసూలు చేసిన ఛార్జీలపై ఎస్‌బీఐ స్పష్టతనిచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆగస్టు 2012 లో, 4 ఉచిత లావాదేవీలకు మించి బీఎస్‌బీడీ ఖాతాలలో సహేతుకమైన ఛార్జీలు వసూలు చేయడానికి బ్యాంకులకు స్వేచ్ఛనిచ్చింది. దీని ప్రకారం, ఎస్‌బీఐ బీఎస్‌బీడీ ఖాతాలలో నాలుగు ఉచిత లావాదేవీలకు మించి డెబిట్ లావాదేవీల కోసం ఛార్జీలను ప్రవేశపెట్టింది ఇది జూన్ 15, 2016 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.
2020 ఆగస్టులో చేసిన‌ డిజిటల్ లావాదేవీలపై  జ‌న‌వ‌రి2020 తరువాత నుంచి వసూలు చేసిన ఛార్జీలను తిరిగి చెల్లించాలని, అలాంటి వాటి ద్వారా భవిష్యత్తులో జరిగే లావాదేవీలపై ఛార్జీలు విధించవద్దని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సిబిడిటి) బ్యాంకులకు సూచించింది. 

ఆదేశాలను అనుసరించి, అన్ని డిజిటల్ లావాదేవీలకు సంబంధించి జ‌న‌వ‌రి 2020 నుంచి సెప్టెంబ‌ర్ 2020 వ‌ర‌కు  వసూలు చేసిన ఛార్జీలను బీఎస్‌బీడీ వినియోగదారులకు ఎస్‌బీఐ తిరిగి చెల్లించింది. 

ఎస్‌బీఐ అన్ని డిజిటల్ లావాదేవీలపై ఇటువంటి ఖాతాలలో ఛార్జీలు తిరిగి పొందడం ఆపివేసింది. అయితే నగదు ఉపసంహరణపై ఛార్జీలను నెలకు నాలుగు ఉచిత ఉపసంహరణలకు మించి  చేస్తే  వసూలు చేస్తోంది అని బ్యాంక్ తెలిపింది.

ఎస్‌బీఐ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతా:

ఖాతా తెరిచే సమయంలో కూడా కనీస బ్యాలెన్స్ అవసరం లేదు. వినియోగదారునికి ఎటువంటి రుసుము లేకుండా ఏటీఎం- కమ్-డెబిట్ కార్డు అందిస్తుంది. డిపాజిట్, ఉపసంహరణ సేవలు ఉచితం. అలాగే, పనిచేయని ఖాతాల‌కు, తిరిగి యాక్టివేట్ చేసేందుకు కూడా  ఛార్జీలు విధించదు.

ఎస్‌బీఐ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతా నగదు, ఏటిఎం ఉపసంహరణలు:
ఎస్‌బీఐ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతా ఒక నెలలో గరిష్టంగా 4 నగదు ఉపసంహరణలను ఉచితంగా అనుమతిస్తుంది, ఎస్‌బీఐ, ఇత‌ర బ్యాంకుల ఏటీఎంల‌లో కూడీ ఈ లావాదేవీలు ఉచితం.

ఎస్‌బీఐ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతా వడ్డీ రేటు‌:
సాధారణ పొదుపు బ్యాంకు ఖాతాల మాదిరిగానే జీరో బ్యాలెన్స్ ఖాతాలపై ఎస్‌బీఐ వడ్డీ రేటును అందిస్తుంది. రూ.1 లక్ష వరకు డిపాజిట్లపై బ్యాంక్ సంవత్సరానికి 2.70 శాతం వడ్డీ రేటును ఇస్తుంది.
ఎస్‌బీఐ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతా నుంచి నెలలో గరిష్టంగా 4 నగదు ఉపసంహరణలను ఉచితంగా అనుమతిస్తుంది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని