అంద‌రు బీమా ఏజెంట్లు ఒకేలా ఉండ‌రు

ఆన్లైన్ విధానంలో కాకుండా బీమా ఏజెంట్ నుంచి నేరుగా బీమా పాలసీని కొనుగోలు చేస్తున్నప్పుడు, స‌ద‌రుఏజెంట్ ను అడిగి పూర్తి వివ‌రాలు తెలుసుకోవాలి. బీమా పరిశ్రమలో మిస్-సెల్లింగ్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది..

Published : 18 Dec 2020 19:06 IST

ఆన్లైన్ విధానంలో కాకుండా బీమా ఏజెంట్ నుంచి నేరుగా బీమా పాలసీని కొనుగోలు చేస్తున్నప్పుడు, స‌ద‌రుఏజెంట్ ను అడిగి పూర్తి వివ‌రాలు తెలుసుకోవాలి. బీమా పరిశ్రమలో మిస్-సెల్లింగ్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది, కాబ‌ట్టి ముందు కొన్ని ప్రాథమిక అంశాలను తెలుసుకోవ‌డం పాల‌సీదారునికి ముఖ్యం. పాల‌సీదారుడు, బీమా సంస్థ మధ్య ఉండే సుదీర్ఘ ఒప్పందం బీమా పాల‌సీ. వాస్తవానికి, పాలసీ సంబంధిత అంశాలు ఒప్పందం రూపంలో ముద్రించి పాల‌సీదారుల‌కు అందిస్తారు. పాల‌సీదారులు త‌మకు ఏవైనా సందేహాలు ఉంటే పూర్తి పాలసీ వివరాలను గురించి బీమా ఏజెంటుని అడగవచ్చు. ఒక ఏజెంట్ లేదా బ్రోకర్ పాల‌సీ కొనుగోలు చేసేట‌పుడు మాత్ర‌మే క‌నిపించే వ్య‌క్తిగా కాకుండా పాల‌సీ కొన‌సాగిస్తున్నంత కాలంలో కూడా పాల‌సీకి సంబంధించి వివ‌రాలు తెలియ‌చేసేవారుగా భావించాలి. కాబట్టి, బీమా పాల‌సీ అందించే వివిధ సేవ‌ల గురించి ఏజెంటుని సంప్ర‌దించి పూర్తి వివ‌రాలు తెలుసుకోవడం ఉత్తమం. ఏజెంట్ ప‌నిత‌నాన్ని అంచ‌నా వేయండి. బీమా పాల‌సీ తీసుకోమ‌ని ఏజెంట్లు సంప్ర‌దించిన‌పుడు వారిని కొన్ని ప్ర‌శ్న‌లు అడ‌గ‌డం ద్వారా వారి ప‌నిత‌నాన్ని అంచ‌నా వేయ‌వ‌చ్చు. అంద‌రు బీమా ఏజెంట్లు ఒకేలా ఉండ‌రు కాబ‌ట్టి వారి సామర్ధ్యాలను గుర్తించేందుకు, తన వృత్తికి సంబంధించి కొన్ని విష‌యాల‌ను అడిగి తెలుసుకోవాలి. ఈ వృత్తిలో ఎంత కాలం నుంచి కొన‌సాగుతున్నారు. ఎందుకంటే సుదీర్ఘ‌కాలం నుంచి ఏజెంటుగా కొన‌సాగేవారికి మంచి అవ‌గాహ‌న ఉంటుంద‌ని భావించ‌వ‌చ్చు.

సంవత్సరానికి ఆ ఏజెంట్ ఎన్ని పాల‌సీల‌ను విక్రయిస్తున్నాడు? విక్ర‌యించిన వాటిలో ఎన్ని అమలులో ఉన్నాయి? ఎన్ని కొన‌సాగ‌డంలేదో తెలుసుకోవాలి. ఏజెంట్ పార్ట్ టైమ్ గా చేస్తున్నారా? లేదా పూర్తి సమయం చేస్తున్నారా? ఆర్థిక ప్రణాళిక అవసరాలకు సంబంధించి ఏవైనా శిక్షణ తీసుకున్నారా త‌దిత‌ర వివ‌రాల‌ను అడిగి తెలుసుకోవాలి. వీటి ద్వారా స‌ద‌రు ఏజెంటు గురించి కొంత అవ‌గాహ‌న‌కు రావ‌చ్చు. కొంద‌రు ఏజెంట్లు త‌మ డ‌బ్బుతో మొదటి నెల / త్రైమాసిక ప్రీమియం చెల్లింపులు చేస్తుంటారు. ఈ విధంగా చేయ‌వ‌ద్దు. దీని వ‌ల్ల మీకు అనుకూలంగా ఉండే పాల‌సీ తీసుకోకుండా ఎక్కువ క‌మీష‌న్ వ‌చ్చే పాల‌సీల‌ను సిఫార్సు చేసేందుకు అవ‌కాశం ఉంటుంది.

ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీకి టోల్ ఫ్రీ నెంబ‌రు ఉంటుంది. పాల‌సీ గురించి కూలంక‌షంగా అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది. ఏజెంట్ చెప్పిన వివరాలను క‌చ్చితంగా ఉన్నాయా లేదానే విష‌యాన్ని పాల‌సీదారులు ఆ నెంబ‌రు ద్వారా సంప్రదించి తెలుసుకోవ‌చ్చు. బీమా సంస్థలు మార్కెట్లో ఉండే అవ‌స‌రాల‌కు డిమాండ్ కు అనుగుణంగా పాల‌సీల‌ను రూపొందిస్తుంటాయి. మార్కెట్లో ఆవిష్కరించేందుకు ముందు ఐఆర్‌డీఏఐ స‌మీక్షిస్తుంది. కాబట్టి, వినియోగదారులు స్పష్టమైన అవ‌గాహ‌న క‌లిగి ఉంటే తప్పు అమ్మకం సమస్య ఉండదు. బీమా పాల‌సీకి సంబంధించిన నిబంధనలు, షరతులకు సంబంధించి పాల‌సీ ప‌త్రాల్లో ఉండే టెక్నిక‌ల్ అంశాల‌ను అర్థం చేసుకునేందుకు బీమా ఏజెంటు\మధ్యవర్తిని అడిగి తెలుసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని