Ducati special Panigale V2: డుకాటీ ప్రత్యేక సూపర్‌బైక్‌ @₹21లక్షలు

ఇటలీకి చెందిన సూపర్‌బైక్‌ తయారీ సంస్థ డుకాటీ.. పినగేల్‌ వీ2 మోడల్‌లో ప్రత్యేక ఎడిషన్‌ బైక్‌ను భారత్‌లో విడుదల చేసింది.....

Published : 16 Mar 2022 15:18 IST

దిల్లీ: ఇటలీకి చెందిన సూపర్‌బైక్‌ల తయారీ సంస్థ డుకాటీ.. పినగేల్‌ వీ2 మోడల్‌లో ప్రత్యేక ఎడిషన్‌ను భారత్‌లో విడుదల చేసింది. దీని ధర రూ.21.30 లక్షలు (ఎక్స్‌షోరూం). పినగేల్‌ వీ2 బేలిస్‌గా దీన్ని పిలుస్తున్నారు. డుకాటీ 996 ఆర్‌తో ట్రాయ్‌ బేలిస్‌ 2001లో తొలి వరల్డ్‌ సూపర్‌బైక్‌ టైటిల్‌ గెలుచుకొని 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దీన్ని రూపొందించారు.

గత పినగేల్‌ వీ2 వెర్షన్లతో పోలిస్తే.. దీని బరువు 3 కిలోలు తగ్గినట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. లిథియం అయాన్‌ బ్యాటరీ, సింగిల్‌ సీటర్‌ కాన్ఫిగరేషన్‌ వల్లే బరువు తగ్గిందని పేర్కొంది. 955 సీసీ ట్వన్‌ సిలిండర్ ఇంజిన్‌ గల ఈ బైక్‌ 10,750 ఆర్‌పీఎం వద్ద 155హెచ్‌పీ శక్తిని, 9,000 ఆర్‌పీఎం వద్ద 104 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌ సైడ్‌ ప్యానెళ్లపై 21 నెంబరుని ముద్రించారు. అలాగే మొత్తం మూడు కలర్లతో ట్రిపుల్‌ టోన్‌ పెయింట్‌తో రూపొందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని