బంగారం స్వచ్ఛత ను తెలుసుకునేందుకు ఐదు మార్గాలు

ఎవరైనా బంగారం లేదా బంగారు ఆభరణాలను కొనాలని భావించినప్పుడు, వారు బంగారం స్వచ్ఛతను ముందుగా నిర్ధారించుకోవలసి ఉంటుంది.........

Published : 21 Dec 2020 16:15 IST

ఎవరైనా బంగారం లేదా బంగారు ఆభరణాలను కొనాలని భావించినప్పుడు, వారు బంగారం స్వచ్ఛతను ముందుగా నిర్ధారించుకోవలసి ఉంటుంది.​​​​​​​

భారతీయులు ఎక్కువగా కొనుగోలు చేసే వస్తువు బంగారం. పురాతన కాలం నుంచి భారతదేశంలో బంగారాన్ని విలువైన వస్తువుగా పరిగణిస్తున్నారు. పట్టణ ప్రాంతాల వాళ్ళైనా లేదా గ్రామీణ ప్రాంతం వాళ్ళైనా, ధనిక లేదా పేద వాళ్ళైనా ప్రతి ఒక్కరూ బంగారం కొనడానికి ప్రయత్నిస్తారు. బంగారాన్ని కొనుగోలు చేయడానికి మహిళలు ఎక్కువగా ఆసక్తి కనపరుస్తారు. అలాగే వారు ఎక్కువగా నగల రూపంలో బంగారం కొనడానికి ఇష్టపడతారు.

భారతదేశంలో వినియోగదారుల హక్కులను పరిరక్షించడానికి ప్రభుత్వం బంగారు ఆభరణాల హాల్‌మార్కింగ్ ను తప్పనిసరి చేసింది. బంగారు ఆభరణాల హాల్‌మార్కింగ్ నాణ్యతపై నియంత్రణను కలిగి ఉండటమే కాకుండా మోసం చేయడానికి ప్రయత్నించే షాపు యజమానులు నుంచి వినియోగదారులను కాపాడుతుంది.

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) చట్టం ప్రకారం, భారతీయ ప్రమాణాల ఆధారంగా బంగారాన్ని హాల్‌మార్కింగ్ ఏజెన్సీ ధృవీకరిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే, బంగారు ఆభరణాలను అధికారిక హాల్‌మార్కింగ్ కేంద్రాల్లో మూల్యాంకనం చేసి పరీక్షిస్తారు, అనంతరం బంగారం జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా స్వచ్ఛత కలిగి ఉందని ధృవీకరిస్తుంది.

బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే ముందు హాల్‌మార్క్‌ను తప్పక తనిఖీ చేయాలి. హాల్‌మార్క్ ఐదు భాగాలను కలిగి ఉంటుంది

(1) బీఐఎస్ ప్రామాణిక గుర్తు :

బీఐఎస్ హాల్ మార్క్ చూడడానికి ఇలా ఉంటుంది

bis.png

(2) స్వచ్ఛమైన బంగారం :

999 – 24 క్యారట్ - స్వచ్ఛమైన బంగారం
958 – 23 క్యారట్
916 – 22 క్యారట్
875 – 21 క్యారట్
750 – 18 క్యారట్
708 – 17 క్యారట్
585 – 14 క్యారట్
417 – 10 క్యారట్
375 – 9 క్యారట్
333 – 8 క్యారట్

(3) హాల్ మార్కింగ్ సెంటర్ మార్క్ :

ఆభరణాలను హాల్‌మార్క్ చేసిన హాల్‌మార్కింగ్ సెంటర్ లోగోను తప్పకుండా తనిఖీ చేయాలి. హాల్‌మార్కింగ్ కేంద్రాల జాబితా కోసం https://bis.gov.in/cert/list_of_hc.asp/. వెబ్ సైట్ ను సందర్శించండి.

(4) మార్కింగ్ సంవత్సరం :

ఆల్ఫాబెట్స్ ఆభరణాల హాల్‌మార్కింగ్ సంవత్సరాన్ని సూచిస్తాయి, దీనిని బీఐఎస్ నిర్ణయిస్తుంది. ఉదాహరణకు ‘ఎ’ అక్షరం 2000 సంవత్సరాన్ని సూచిస్తుంది, అలాగే ‘జే’ 2008, ‘ఎన్’ 2010, ‘ఎం’ 2011, ‘ఎన్’ 2012 మొదలైనవి.

(5) జ్యువెలర్స్ ఐడెంటిఫికేషన్ మార్క్ :

చాలా మంది వ్యాపారస్తులు తమ సొంత బీఐఎస్ సర్టిఫైడ్ ఐడెంటిఫికేషన్ మార్క్ ను ఉంచుతారు.

బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, బీఐఎస్ హాల్‌మార్క్ ఆభరణాలను విక్రయించే షాపులను సందర్శించి, హాల్‌మార్క్ గుర్తు కలిగిన ఆభరణాలను మాత్రమే కొనుగోలు చేయండి. హాల్‌మార్క్ గుర్తు స్వచ్ఛతకు భరోసా ఇస్తుంది. బంగారాన్ని కొనుగోలు చేసి తరువాత క్యాష్ మెమోను అడిగి తీసుకోండి. ఒకవేళ మీకు ఏవైనా ఫిర్యాదులు ఉంటే, వాటిని పరిష్కరించడానికి క్యాష్ మెమో సహాయపడుతుంది.

బంగారు ఆభరణాలపై హాల్‌మార్కింగ్ ఛార్జీ కేవలం రూ. 25. అలాగే కేడీఎం ఆభరణాలు హాల్‌మార్క్ చేసిన ఆభరణాలు కాదు. కావున బంగారం స్వచ్ఛతను కేడీఎం నిర్ధారించదని గుర్తుంచుకోండి.

మరింత సమాచారం కోసం బీఐఎస్ వెబ్ సైట్ www.bis.org.in ను సందర్శించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని