ఎప్పుడైనా స‌రే.. ఫ్లెక్సీ డిపాజిట్

ఫ్లెక్సీ రిక‌రింగ్ డిపాజిట్ ఖాతాలు దాదాపు అన్ని బ్యాంకులు అందిస్తున్నాయి. అయితే బ్యాంకుల‌ను బ‌ట్టి వీటి నిబంధ‌న‌లు మారుతుంటాయి. కాబ‌ట్టి మ‌దుప‌ర్లు త‌మ‌కు స‌రిపోయే వాటిని ఎంచుకోవాలి..

Published : 15 Dec 2020 19:02 IST

పేరులో ఉన్నట్టే సాధారణ రిక‌రింగ్ డిపాజిట్ (ఆర్డీ) ఖాతాకు అదనపు సౌకర్యాలను జ‌త‌చేసిందే ఫ్లెక్సీ ఆర్డీ ఖాతా. ఈ ఖాతాలో రెండు విభాగాలు ఉంటాయి.

  • కోర్ ఖాతా
  • ఫ్లెక్సీ ఖాతా

కోర్ ఖాతాలో మ‌దుప‌రి బ్యాంకుతో చేసుకున్న‌ఒప్పందం ప్ర‌కారం నిర్ణీత కాల‌ప‌రిమితిలో చెల్లింపులు చేయాలి.
ఫ్లెక్సీ ఖాతా విష‌యానికి వ‌స్తే ఎప్పుడైనా స‌రే మ‌దుప‌రి వ‌ద్ద డ‌బ్బు ఉన్న‌పుడు డిపాజిట్ చేయ‌వ‌చ్చు.

వ‌డ్డీ రేటు

కోర్ భాగానికి సంబంధించి వ‌డ్డీ అప్ప‌టి రిక‌రింగ్ డిపాజిట్ల ఆధారంగా నిర్ణ‌యిస్తారు. ఫ్లెక్సీ డిపాజిట్ భాగానికి సంబంధించిన వ‌డ్డీ రేట్ల‌ను అప్ప‌టి కాల‌ప‌రిమితి డిపాజిట్లకు ఇచ్చే దాన్ని బ‌ట్టి ఉంటుంది.

తేదీ, పెనాల్టీ

కోర్ భాగానికి నిర్ణీత తేదీనే డ‌బ్బును చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించ‌ని డిపాజిట్ల‌కు పెనాల్టీ విధిస్తారు. మ‌రోవైపు ఫ్లెక్సిబుల్ డిపాజిట్ భాగంలో ఖాతాదారు ఇష్టానికి అనుగుణంగా డిపాజిట్ చేయ‌వ‌చ్చు.

ఉదాహరణకు వెయ్యి రూపాయల మొత్తంతో పదేళ్ల కాలానికి రిక‌రిండ్ డిపాజిట్ చేస్తే నెలనెలా నిర్ణీత తేదీలోపే వెయ్యి రూపాయలు డిపాజిట్ చేస్తూ వెళ్లాలి. అదే ఫ్లెక్సీ ఆర్‌డీలో నిర్ణీత మొత్తం నిబంధ‌న ఉండదు. ఎప్పుడైనా అదనంగా మీ దగ్గర నగదు ఉన్నా, బోనస్ వచ్చినా ఆ మొత్తాన్ని ఫ్లెక్సీ ఆర్డీలో జమ చేసుకోవచ్చు.ఆ రోజు ఉన్న వడ్డీ రేటు ఆ మొత్తానికి అమలవుతుంది. అసలు వెయ్యి రూపాయలకు వడ్డీ రేటు మాత్రం ఖాతా తెరచిన రోజు ఉన్నరేటే అమలవుతుంది.

కాలానుగుణంగా బ్యాంకులు వీటిలో మార్పులు చేర్పులు చేస్తుంటాయి. ఫ్లెక్సీ రిక‌రింగ్ డిపాజిట్‌ ఖాతాల‌కు సంబంధించి నిబంధ‌న‌లు బ్యాంకుల‌ను బ‌ట్టి మారుతుంటాయి.

ఎస్‌బీఐ ఫ్లెక్సీ రిక‌రింగ్ డిపాజిట్ ఖాతాను తీసుకుంటే

  • ఖాతా తెరిచేందుకు క‌నీసం రూ. 500 ల‌తో ప్రారంభించ‌వ‌చ్చు.
  • అయితే క‌నీసం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 5,000 పెట్టుబ‌డి చేయాలి.(అదనంగా రూ.500 / - గుణిజాలు)
  • గరిష్టంగా రూ. 50,000 / - వ‌ర‌కూ చేయ‌వ‌చ్చు.
  • నెలలో ఏదైనా ఒక రోజును చెల్లింపుతేదీగా పెట్టుకోవ‌చ్చు.
  • వీటిపై రుణ సదుపాయం అందుబాటులో ఉంది .
  • డిపాజిట్ ఎన్నిసార్లయినా చేయవచ్చు.
  • డిపాజిట్ చెల్లింపులో ఆల‌స్యమైతే అప‌రాధ రుసుము ఆర్థిక సంవత్సరానికి రూ .50 / - విధిస్తారు…
  • కాల‌ప‌రిమితి కనిష్టంగా - 5 సంవత్సరాలు, గరిష్టంగా - 7 సంవత్సరాలు.
  • ముందుగా ఉప‌సంహ‌రించుకోవాలంటే మ‌దుప‌రి పొందుతున్న వ‌డ్డీలో 0.50 శాతం త‌క్కువ అందుతుంది. మూలం వద్ద పన్ను మినహాయింపు ఉంటుంది. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని