13 నుంచి మెడ్‌ప్లస్‌ ఐపీఓ

ఔషధ దుకాణాలను నిర్వహించే హైదరాబాదీ సంస్థ మెడ్‌ప్లస్‌ హెల్త్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ ఇష్యూ ఈనెల 13న ప్రారంభమై 15న ముగుస్తుంది. రూ.1,398 కోట్లు సమీకరించే లక్ష్యంతో వస్తున్న ఈ ఐపీఓకు, రూ.2 ముఖవిలువ గల ఒక్కో షేరు ధరను

Published : 08 Dec 2021 02:23 IST

ధరల శ్రేణి రూ.780-796

ఈనాడు, హైదరాబాద్‌: ఔషధ దుకాణాలను నిర్వహించే హైదరాబాదీ సంస్థ మెడ్‌ప్లస్‌ హెల్త్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ ఇష్యూ ఈనెల 13న ప్రారంభమై 15న ముగుస్తుంది. రూ.1,398 కోట్లు సమీకరించే లక్ష్యంతో వస్తున్న ఈ ఐపీఓకు, రూ.2 ముఖవిలువ గల ఒక్కో షేరు ధరను రూ.780-796గా సంస్థ నిర్ణయించింది. కనీసం 18 షేర్లకు (ఒక లాట్‌) దరఖాస్తు చేసుకోవాలి. ఇష్యూలో రూ.600 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేయనుండగా, రూ.798.30 కోట్ల విలువైన షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌)లో భాగంగా ప్రమోటర్లు, ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులు విక్రయించనున్నారు. రూ.5 కోట్ల విలువైన షేర్లను సంస్థ ఉద్యోగులకు కేటాయించనున్నారు. వీరికి షేరు జారీ ధరలో రూ.78 చొప్పున రాయితీ లభించనుంది.  మెడ్‌ప్లస్‌ వ్యవస్థాపకుడు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ గంగిడి మధుకర్‌ రెడ్డి మాట్లాడుతూ.. తాజా షేర్ల జారీ ద్వారా లభించే నిధులను మూలధన అవసరాలు, అనుబంధ సంస్థ ఆప్టివల్‌ విస్తరణ కోసం వినియోగిస్తామని తెలిపారు. కొవిడ్‌ లాక్‌డౌన్‌ కాలాన్ని మినహాయించినా, ఏడాది వ్యవధిలో 700 పైగా కొత్త స్టోర్లను ప్రారంభించామని, మొత్తంమీద 2,000కు పైగా ఉన్నాయని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని