ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ నుంచి నూతన శ్రేణి ఓఎల్‌ఈడీ టీవీలు

నూతన శ్రేణి ఓఎల్‌ఈడీ టీవీలను ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టింది. అద్భుతమైన దృశ్య నాణ్యత, మెరుగైన పనితీరు, ఆకర్షణీయమైన డిజైన్‌, అధునాతన టెక్నాలజీ ఈ టీవీల ప్రత్యేకతలుగా ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ వివరించింది. ప్రపంచంలోనే పెద్దదైన 246 సెంటీమీటర్ల (97 అంగుళాలు)

Published : 29 May 2022 02:34 IST

ఈనాడు, హైదరాబాద్‌: నూతన శ్రేణి ఓఎల్‌ఈడీ టీవీలను ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టింది. అద్భుతమైన దృశ్య నాణ్యత, మెరుగైన పనితీరు, ఆకర్షణీయమైన డిజైన్‌, అధునాతన టెక్నాలజీ ఈ టీవీల ప్రత్యేకతలుగా ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ వివరించింది. ప్రపంచంలోనే పెద్దదైన 246 సెంటీమీటర్ల (97 అంగుళాలు) టీవీ 2022 ఓఎల్‌ఈడీ టీవీల శ్రేణిలో ఉన్నట్లు వెల్లడించింది. చిన్న గదులకు అనువుగా ఉండే 106 సెంటీమీటర్ల (42 అంగుళాలు)టీవీ ఇందులో ఉన్నట్లు పేర్కొంది. ఇవే కాకుండా సీ2 సిరీస్‌లో ఎల్‌డీ ఓఎల్‌ఈడీ ఎవో టీవీని ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించింది. భారతదేశంలో గత పాతికేళ్లుగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కల ఉత్పత్తులను అందిస్తూ ముందుకు సాగుతున్నట్లు, ఇదే కోవలో ఇప్పుడు నూతన శ్రేణి ఓఎల్‌ఈడీ టీవీలను తీసుకువచ్చినట్లు ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండిó డైరెక్టర్‌ (హోమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌) హక్‌ యున్‌ కిమ్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని