Restaurants Service Charge: రెస్టారెంట్‌లు సేవా రుసుం విధించకుండా కొత్త నియమావళి

వినియోగదారుల నుంచి రెస్టారెంట్‌లు సేవా రుసుం వసూలు చేయకుండా నియంత్రించడానికి ప్రభుత్వం న్యాయపరమైన నియమావళిని త్వరలో తీసుకురానున్నట్లు వినియోగదారు వ్యవహారాల కార్యదర్శి రోహిత్‌ కుమార్‌ వెల్లడించారు. వినియోగదారులు, రెస్టారెంట్‌ల సంఘాల ప్రతినిధులతో

Updated : 03 Jun 2022 10:14 IST

వినియోగదారు వ్యవహారాల కార్యదర్శి రోహిత్‌ కుమార్‌

దిల్లీ: వినియోగదారుల నుంచి రెస్టారెంట్‌లు సేవా రుసుం వసూలు చేయకుండా నియంత్రించడానికి ప్రభుత్వం న్యాయపరమైన నియమావళిని త్వరలో తీసుకురానున్నట్లు వినియోగదారు వ్యవహారాల కార్యదర్శి రోహిత్‌ కుమార్‌ వెల్లడించారు. వినియోగదారులు, రెస్టారెంట్‌ల సంఘాల ప్రతినిధులతో ఆయన గురువారం సమావేశమయ్యారు. సేవా రుసుం వసూలు చేయడం న్యాయబద్ధమేనని సంఘాలు చెబుతున్నప్పటికీ.. వినియోగదారుల హక్కులకు ఇది ప్రతికూలంగా ఉందని, అనైతిక వ్యాపార విధానంగా వినియోగదారు వ్యవహారాల విభాగం పరిగణిస్తున్నట్లు స్పష్టం చేశారు. 2017 మార్గదర్శకాలు అమలు కావడం లేదు కనుక, కొత్త నియమావళిని తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు. ఈ సమావేశానికి నేషనల్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ), ఫెడరేషన్‌ ఆఫ్‌ హోటల్‌ అండ్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌హెచ్‌ఆర్‌ఏఐ), ముంబయి గ్రాహక్‌ పంచాయత్‌, పుష్ప గిరిమాజీ సహా వినియోగదారు సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని