Wipro CEO: ఐటీలో విప్రో సీఈఓకే అధిక వేతనం.. ఎంతంటే?

దేశీయ ఐటీ రంగంలో అత్యధిక వార్షిక వేతన ప్యాకేజీ అందుకున్న ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా  విప్రో సీఈఓ డెలా పోర్టె నిలిచారు. ఆయనకు 2021-22కు రూ.79.8 కోట్ల వేతనప్యాకేజీ లభించింది. ఇన్ఫోసిస్‌ సీఈఓ సలీల్‌ పరేఖ్‌

Updated : 11 Jun 2022 07:26 IST

దిల్లీ: దేశీయ ఐటీ రంగంలో అత్యధిక వార్షిక వేతన ప్యాకేజీ అందుకున్న ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా  విప్రో సీఈఓ డెలా పోర్టె నిలిచారు. ఆయనకు 2021-22కు రూ.79.8 కోట్ల వేతనప్యాకేజీ లభించింది. ఇన్ఫోసిస్‌ సీఈఓ సలీల్‌ పరేఖ్‌ రూ.71 కోట్లు, టీసీఎస్‌ సీఈఓ-ఎండీ రాజేశ్‌ గోపీనాథన్‌ రూ.25.8 కోట్లు అందుకుని తదుపరి స్థానాల్లో నిలిచారు. విప్రోలో 2020 జులైలో చేరిన డెలాపోర్టె 2020-21 ఆర్థిక సంవత్సరం 9 నెలలకు గాను రూ.64.3 కోట్ల వేతన ప్యాకేజీ అందుకున్నారు. 2021-22కు వస్తే వేతనం, అలవెన్సులు కలిపి రూ.13.2 కోట్లు, కమీషన్లు-వేరియబుల్‌ పే కింద రూ.19.3 కోట్లు, ప్రయోనాల కింద రూ.31.8 కోట్లు డెలాపోర్టెకు లభించాయి. మిగిలిన మొత్తం దీర్ఘకాల పరిహారం కింద అందాయి. ఒక్కసారి నగదు అవార్డు కూడా కలిపి ఉంది. ఇదే సమయంలో విప్రో ఛైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీ 2021-22కు 1.82 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.14 కోట్ల) ప్యాకేజీ అందుకున్నారు. 2020-21లో ఆయనకు రూ.11.8 కోట్లు లభించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని