బ్రెజా కొత్త వెర్షన్‌

మారుతీ సుజుకీ ఇండియా తమ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ బ్రెజా మోడల్‌లో కొత్త వెర్షన్‌ను గురువారం విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.7.99 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌).  రెండో తరం బ్రెజా విపణిలో టాటా నెక్సాన్‌, హ్యుందాయ్‌ వెన్యూ, కియా సోనెట్‌ వంటి మోడళ్లతో పోటీ పడుతుంది.

Published : 01 Jul 2022 02:02 IST

ప్రారంభ ధర రూ.7.99 లక్షలు

దిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా తమ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ బ్రెజా మోడల్‌లో కొత్త వెర్షన్‌ను గురువారం విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.7.99 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌).  రెండో తరం బ్రెజా విపణిలో టాటా నెక్సాన్‌, హ్యుందాయ్‌ వెన్యూ, కియా సోనెట్‌ వంటి మోడళ్లతో పోటీ పడుతుంది. మాన్యువల్‌ రకం బ్రెజా కొత్త వెర్షన్‌లు రూ.7.99-12.46 లక్షల మధ్య, ఆటోమేటిక్‌ వెర్షన్‌లు రూ.10.96-13.96 లక్షల మధ్య లభిస్తాయని కంపెనీ వెల్లడించింది. 2016 మార్చిలో బ్రెజాతో కాంపాక్ట్‌ ఎస్‌యూవీ విభాగంలోకి అడుగుపెట్టిన మారుతీ ఇప్పటి వరకు 6 ఏళ్లలో 7.5 లక్షల వాహనాలను విక్రయించింది. రెండో తరం బ్రెజా నెక్ట్స్‌ జెన్‌ కె-సిరీస్‌ 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌, స్మార్ట్‌ హైబ్రిడ్‌ టెక్నాలజీతో రూపొందాయని, లీటరుకు 20.15 కిలోమీటర్ల ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని కంపెనీ వివరించింది.  6 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు 20కి పైగా భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నట్లు పేర్కొంది. 6-స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌, ఎలక్ట్రిక్‌ సన్‌రూఫ్‌, హెడ్‌-ల్యాంప్‌ డిస్‌ప్లే, డిజిటల్‌ 360 కెమేరా, 40 కనెక్టెడ్‌ ఫీచర్లు ఇందులో ఉన్నాయని వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని