వైవిధ్యమైన పెట్టుబడి కోసం...

సాధారణంగా ఈక్విటీ పథకాల పెట్టుబడులు నూరు శాతం ఈక్విటీ షేర్లలో ఉంటాయి. కానీ బ్యాలెన్స్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లు మాత్రం 35 శాతం వరకూ రుణ...

Updated : 13 Aug 2021 04:07 IST

ఎస్‌బీఐ ఎంఎఫ్‌ బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌

సాధారణంగా ఈక్విటీ పథకాల పెట్టుబడులు నూరు శాతం ఈక్విటీ షేర్లలో ఉంటాయి. కానీ బ్యాలెన్స్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లు మాత్రం 35 శాతం వరకూ రుణ పత్రాల్లో, మిగిలిన 65 శాతం సొమ్మును ఈక్విటీ షేర్లలో పెట్టుబడి పెడతాయి. అదే సమయంలో ఆదాయపు పన్ను లెక్కింపు నిబంధనల ప్రకారం ఇటువంటి పథకాలను ఈక్విటీ ఫండ్లుగా పరిగణిస్తారు. బ్యాలెన్స్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లు ఈక్విటీ మార్కెట్లలో ఎదురయ్యే హెచ్చుతగ్గుల ప్రభావాన్ని తగ్గించుకొని స్ధిరమైన ప్రతిఫలాన్ని ఆర్జించే ప్రయత్నం చేస్తాయి. ఈ కోవలోకి వచ్చే ఎస్‌బీఐ బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌ అనే పథకాన్ని ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా తీసుకొచ్చింది.

ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ఈ నెల 25న ముగుస్తుంది. కనీస పెట్టుబడి రూ.5,000. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. క్రిసిల్‌ హైబ్రీడ్‌ 50+50 - మోడరేట్ ఇండెక్స్‌ టీఆర్‌ఐ సూచీని ఈ పథకానికి ప్రామాణికంగా తీసుకుంటారు. దినేష్‌ బాలచంద్రన్‌, గౌరవ్‌ మెహతా (ఈక్విటీ విభాగం), దినేష్‌ అహుజా (రుణ విభాగం), మోహిత్‌ జైన్‌ (విదేశీ పెట్టుబడులు) దీనికి ఫండ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తారు. దీర్ఘకాలిక మూలధన వృద్ధిని ఆశిస్తున్న మదుపరులకు ఇటువంటి బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లు అనుకూలంగా ఉంటాయి. కనీసం అయిదేళ్ల పాటు ఎదురుచూడగలిగిన పక్షంలో ఈ ఫండ్‌ ద్వారా పెట్టుబడి పెట్టే ఆలోచన చేయొచ్చు. పైగా దానివల్ల పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యం కూడా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని