డెట్ ప‌థ‌కాల‌కు వ‌ర్తించే ప‌న్ను రేట్లు

పెట్టుబ‌డుల నికర రాబడి ఎంతో తెలుసుకోవడానికి పన్ను నిబంధనలను కూడా తెలుసుకోవ‌డం ముఖ్యం

Published : 16 Dec 2020 17:51 IST

ఏదైనా పోర్ట్‌ఫోలియోలో మిశ్ర‌మంగా పెట్టుబ‌డులు ఉండాలి. పెట్టుబ‌డుల్లో వైవిధ్య‌త ఉంటే రిస్క్ త‌గ్గుతుంది. ఉదాహరణకు, ఈక్విటీ పెట్టుబడులు దీర్ఘకాలికంగా అన్ని ఇతర పెట్టుబడుల‌ కంటే అధిక రాబడిని ఇస్తాయి, కానీ అవి ఎక్కువ రిస్క్‌తో కూడుకున్న‌వి.

దానిని సమతుల్యం చేయడానికి, డెట్ ప‌థ‌కాల్లో పెట్టుబడి పెట్టాలి. ఇవి కూడా కొంత రిస్క్‌ కలిగి ఉన్నప్పటికీ, ఈక్విటీల‌తో పోలిస్తే సురక్షితమైనవిగా భావిస్తారు. నికర రాబడి ఎంతో తెలుసుకోవడానికి పన్ను నిబంధనలను కూడా తెలుసుకోవ‌డం ముఖ్యం. నియమాలలో ఏదైనా మార్పు చేస్తే దానికి అనుగుణంగా పెట్టుబ‌డుల‌ను మార్చుకోవాలి.

కొన్ని డెట్ ప‌థ‌కాల‌కు వర్తించే పన్ను నిబంధ‌న‌ల‌ను ఇక్కడ చూడండి
డెట్ మ్యూచువ‌ల్ ఫండ్లు:

  • స్వ‌ల్ప‌కాలిక క్యాపిట‌ల్ గెయిన్స్‌పై శ్లాబు ప్ర‌కారం ప‌న్ను వ‌ర్తిస్తుంది
  • దీర్ఘ‌కాలిక క్యాపిట‌ల్ గెయిన్స్‌పై (మూడేళ్ల కంటే ఎక్కువ‌) ఇండెక్సేష‌న్‌తో క‌లిపి 20.8 శాతం

ఫిక్స్ డ్ డిపాజిట్లు:

  • శ్లాబు రేటు ప్ర‌కారం ప‌న్ను
  • సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు రూ.50 వేల వ‌డ్డీ వ‌ర‌కు మిన‌హాయింపు

నేష‌న‌ల్ సేవింగ్స్ స‌ర్టిఫికెట్‌:

  • శ్లాబురేటు ప్ర‌కారం ప‌న్ను
  • వ‌డ్డీని తిరిగి పెట్టుబ‌డి పెడితే, సెక్ష‌న్ 80 సీ ప్ర‌కారం రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు

పోస్టాఫీస్ డిపాజిట్లు:

  • శ్లాబురేటు ప్ర‌కారం ప‌న్ను
  • సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు వ‌డ్డీపై రూ.50 వేల వ‌ర‌కు మిన‌హాయింపు

సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్స్ స్కీమ్:

  • శ్లాబు రేటు ప్ర‌కారం ప‌న్ను
  • రూ.50 వేల వ‌ర‌కు వ‌డ్డీపై టీడీఎస్ ఉండ‌దు
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని