Sputnik Light vaccine | స్పుత్నిక్‌ లైట్‌ టీకా ఉత్పత్తి, విక్రయానికి హెటిరోకు అనుమతి

రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌ లైట్‌ టీకాను భారత్‌లో ఉత్పత్తి, విక్రయానికి అనుమతి లభించినట్లు హెటిరో డ్రగ్స్‌ తెలిపింది.

Published : 21 Mar 2022 20:53 IST

దిల్లీ: రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌ లైట్‌ టీకాను భారత్‌లో ఉత్పత్తి, విక్రయానికి అనుమతి లభించినట్లు హెటిరో డ్రగ్స్‌ తెలిపింది. ఈ మేరకు సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీఈఎస్‌సీఓ) షరతులతో కూడిన అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేసిందని ఓ ప్రకటనలో పేర్కొంది. 18 ఏళ్ల పైబడిన వారికి సింగిల్‌ డోసులో ఇచ్చే టీకాకు అనుమతి పొందిన తొలి బయో ఫార్మాసూటికల్‌ కంపెనీ తమదేనని తెలిపింది. ప్రస్తుతం రెండు డోసుల్లో ఇస్తున్న టీకాలకు మాత్రమే దేశంలో వినియోగ అనుమతి ఉంది.

రష్యా రూపొందించిన ‘స్పుత్నిక్‌ లైట్‌’ వ్యాక్సిన్‌ను భారత్‌లో తయారు చేసేందుకు రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్టిమెంట్‌ ఫండ్‌ (RDIF) ఇక్కడి హెటెరో బయోఫార్మాతో ఒప్పందం చేసుకుంది. ఈ నేపథ్యంలో హెటిరో డ్రగ్స్‌ ఈ టీకాలను తయారు చేస్తోంది. దేశంలో సింగిల్‌ డోసులో ఇచ్చే స్పుత్నిక్‌ లైట్‌ వినియోగానికి డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) అత్యవసర వినియోగానికి గత నెల అనుమతి ఇచ్చింది. కొవిడ్‌ను ఎదుర్కోవడంలో స్పుత్నిక్‌ లైట్‌ టీకా సమర్థంగా పనిచేస్తోందని క్లినికల్‌ డేటాలో వెల్లడైందని హెటిరో సీనియర్‌ వైస్‌ ప్రైసిడెంట్‌  శుబ్‌దీప్‌ సిన్హా ఈ సందర్భంగా తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని