Credit score: మంచి క్రెడిట్ స్కోర్ అంటే ఎంత? దాన్ని సాధించడం ఎలా?
Credit score: రుణం పొందటంలో క్రెడిట్‌స్కోర్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. తక్కువ వడ్డీతో రుణం పొందాలన్నా మంచి స్కోర్ ఉండాల్సిందే.
ఇంటర్నెట్‌డెస్క్: క్రెడిట్‌స్కోర్ రుణమంజూరులో కీలక పాత్ర పోషిస్తుంది. ఎంత మొత్తం రుణం ఇవ్వాలనే విషయాన్ని బ్యాంకులు దీని ఆధారంగానే నిర్ణయిస్తాయి. క్రెడిట్‌స్కోర్ ఎక్కువగా ఉంటే వారి రుణచరిత్ర బాగుందని బ్యాంకులు విశ్వసిస్తాయి. అలాంటి వారికే రుణం మంజూరు చేయటానికి ఆసక్తి చూపుతాయి. అదే క్రెడిట్‌స్కోర్ తక్కువగా ఉంటే రుణం దొరకడం కష్టమే. ఒకవేళ మంజూరైనా ఎక్కువ వడ్డీ రేటు తప్పదు. అందుకే మంచి క్రెడిట్ స్కోర్‌ను కలిగి ఉండడం చాలా ముఖ్యం.
వ్యక్తి ఆర్థిక సామర్థ్యాన్ని క్రెడిట్‌స్కోర్ చెప్పేస్తుంది. ఈ స్కోర్ 750, అంతకంటే ఎక్కువ ఉంటే వ్యక్తి రుణచరిత్ర స్థిరంగా ఉన్నట్లు రుణదాతలు భావిస్తారు. అలాంటి వ్యక్తులకు రుణాలిస్తే ఎటువంటి రిస్క్ ఉండదనుకుంటారు. తక్కువ వడ్డీ రేటుతో రుణాలిస్తారు. కొత్త క్రెడిట్ కార్డులు సైతం త్వరగా ఆమోదం పొందుతాయి. అదే సకాలంలో ఈఎంఐ చెల్లింపులు చేయకపోవడం, క్రెడిట్ కార్డుపై పరిమితికి మించి ఖర్చు చేస్తే స్కోర్ పడిపోతుంది. అలాంటి వారు రుణం పొందాలనుకున్నప్పుడు వేగంగా స్కోర్‌ను పెంచుకోవాలనుకుంటారు. మరి అది సాధ్యమేనా?అయితే ఎలాగో చూద్దాం..
క్రెడిట్‌రిపోర్ట్‌ని చెక్ చేసుకోండి..
ఎప్పటికప్పుడు క్రెడిట్‌రిపోర్ట్‌ని చెక్ చేసుకోవాలి. సిబిల్, ఎక్స్‌పీరియన్, ఈక్విఫాక్స్ ఇలా.. క్రెడిట్‌బ్యూరో సంస్థల నుంచి మీ క్రెడిట్ రిపోర్ట్‌ని తీసుకోవచ్చు. ఆ రిపోర్ట్‌లో పొరపాట్లు ఏమైనా ఉన్నాయేమో తనిఖీ చేసుకోండి. ఒకవేళ అందులో తప్పులుంటే వెంటనే వాటిని సరిచేసుకునేందుకు సంబంధిత క్రెడిట్ బ్యూరోను సంప్రదించాలి. లేదా బ్యాంకుల వద్ద ఉన్న సమాచారంలో ఏదైనా తప్పుందని గమనిస్తే వెంటనే బ్యాంకుకు వెళ్లి సవరించుకోవాలి.
సకాలంలో చెల్లింపులు..
క్రెడిట్‌స్కోర్‌ని లెక్కించటంలో రుణ చరిత్ర ముఖ్య పాత్ర పోషిస్తుంది. మెరుగైన రుణ చరిత్ర కోసం సకాలంలో చెల్లింపులు చేయాలి. ఒక్కోసారి మన వద్ద డబ్బులున్నా సమయానికి రుణం తిరిగి చెల్లించడం మరచిపోతుంటాం. దీంతో క్రెడిట్‌స్కోర్ పడిపోతుంది. ఇలాంటివి జరగకుండా ఉండటానికి పేమెంట్ రిమైండర్‌ని యాక్టివేట్ చేసుకోవడం ఒక మార్గం! లేదా ఆటో డెబిట్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. సమయానికి మీరు మరచిపోయినా అది మీకు గుర్తు చేస్తుంది.
క్రెడిట్ వినియోగాన్ని తగ్గించుకోండి
కొందరు క్రెడిట్ కార్డుపై ఉన్న పరిమితిని పూర్తిగా వినియోగిస్తుంటారు. అలా చేయటం కూడా సరైన పద్ధతి కాదు. కార్డుపై ఉన్న నిర్ణీత పరిమితి కంటే 30శాతం తక్కువే ఖర్చు చేయాలి. అప్పుడు మంచి క్రెడిట్ స్కోర్‌ను మెయింటైన్ చేయొచ్చు.
పెద్ద మొత్తం రుణం వద్దు
పెద్ద మొత్తంలో రుణం అవసరమైనప్పుడు ఒకే రుణం కాకుండా.. వివిధ మార్గాల్లో డబ్బు సమకూర్చుకుంటే మంచిది. మార్టగేజ్, గృహరుణం, వ్యక్తిగత రుణం.. ఇలా రకారకాలుగా డబ్బును పొందొచ్చు. అలా అన్నింటికీ ఒకేసారి దరఖాస్తు చేసుకోవడం కూడా మంచిది కాదు. తక్కువ సమయంలో ఎక్కువ రుణాలకు దరఖాస్తు చేసినా.. క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం ఉంటుంది.
ఆ పాత ఖాతాలు తొలగించొద్దు..
వినియోగంలోలేని క్రెడిట్ అకౌంట్లు (వస్తువులు కొనేందుకు తీసుకునే ఖాతాలు) వృథా అంటూ.. చాలామంది తమ పాత క్రెడిట్ ఖాతాలను క్లోజ్ చేస్తుంటారు. ఒకవేళ ఆ పాత ఖాతాలపై మంచి రుణ చరిత్ర ఉంటే అధిక క్రెడిట్‌స్కోర్‌కు అది దోహదం చేస్తుంది. అందుకే మీరు వినియోగించకున్నా పాత క్రెడిట్ ఖాతాలను తీసేయకండి.
రుణ ఎగవేతను నివారించండి
ఆర్థిక ఇబ్బందులతో ఒకోసారి రుణం కట్టలేకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో ఇతర మార్గాల కోసం రుణదాతను సంప్రదించాలి. లేదంటే ఎగవేతదారుగా ప్రకటిస్తే.. మొదటికే మోసం వస్తుంది. బ్యాంకులు ఇతర సులభ మార్గాలను సూచించే అవకాశం ఉంటుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Chandrababu: వైకాపా ప్రభుత్వ నాలుగేళ్ల పాలనపై చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు
-
India News
Smart phone: ఫోన్ కోసం రిజర్వాయర్‌నే తోడేసిన ఘటన.. పర్మిషన్ ఇచ్చిన అధికారికి జరిమానా!
-
Sports News
CSK vs GT: సీఎస్కేను భయపెట్టిన చెన్నై కుర్రాడు.. గుజరాత్ జట్టులో ‘ఇంపాక్ట్’ అతడు!
-
General News
Vijayawada: చట్టబద్ధంగా రావాల్సిన వాటి కోసం అడగడం తప్పా?: బొప్పరాజు
-
World News
Putin: పశ్చిమ దేశాలను కాదని.. పుతిన్‌కు అండగా దక్షిణాఫ్రికా..!
-
World News
China: రికార్డు స్థాయికి.. చైనా యువత నిరుద్యోగిత రేటు