Infosys Foundation: ఇన్ఫీ దాతృత్వం.. పేద బాలికల చదువుకు ₹100 కోట్లు

Infosys Foundation: వెనకబడిన కుటుంబంలోని బాలికల చదువుకోసం ఆర్థికంగా సాయం అందించటానికి దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సిద్ధమైంది.

Published : 17 Aug 2023 19:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ (Infosys) దాతృత్వానికి ముందుకొచ్చింది. వెనకబడిన కుటుంబాలకు చెందిన బాలికల చదువుకు తన వంతున సహకారం అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ద్వారా బాలికలకు స్కాలర్‌షిప్‌లను అందించనుంది. ఇందుకోసం రూ.100 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇందుకోసం 'STEM Stars' పేరుతో స్కాలర్‌షిప్‌ను తీసుకురానుంది. ఈ స్కాలర్‌షిప్‌ల ద్వారా బాలికల చదువుకు ఆర్థిక సాయం అందుతుందని ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ తెలిపింది. ట్యూషన్‌ ఫీజు, వసతి ఖర్చులు, స్టడీ మెటీరియల్‌ ఇలా.. అన్నింటికీ కలిపి ఏడాదికి లక్ష రూపాయలు.. నాలుగేళ్ల పాటు ఆర్థిక సాయాన్ని అందిస్తామని వెల్లడించింది. ఈ కార్యక్రమం మొదటి ఫేజ్‌లో భాగంగా 2,000 మందికి పైగా బాలికల చదువుకు సాకారం అందించనుంది. దేశంలోని ప్రముఖ కళాశాలల్లో సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, గణితం (STEM) ఏ విభాగంలో ఉన్నత విద్యను అభ్యసించినా ఇన్ఫీ ఫౌండేషన్‌ వారి ఆ బాధ్యతలు చూసుకుంటుంది.

విశాఖ To తిరుమల.. ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే..

‘ఆడపిల్లల చదువు వారి పిల్లల జీవితంపై ప్రభావం చూపుతుంది. అందుకే మేం 'STEM Stars' స్కాలర్‌షిప్‌ను తీసుకొచ్చాం. తొలి ఏడాదిలో ఐఐటీ, బిట్స్‌ పిలానీ, ఎన్‌ఐటీతో పాటు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) గుర్తింపు పొందిన ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో చదవాలనుకున్న విద్యార్థులకు సహకారం అందిస్తాం’ అని ఇన్ఫోసిస ఫౌండేషన్‌ ట్రిస్టీ సుమిత్‌ విర్మనీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని