రిటర్న్ ఆఫ్ ప్రీమియం టర్మ్ ఇన్సూరెన్స్ vs టర్మ్ ఇన్సూరెన్స్

బీమా పాలసీ కాల వ్యవధి పూర్తైయ్యే వరకు ఎలాంటి ప్రమాదం జరగనట్లైతే, పాలసీ కోసం చెల్లించిన అన్ని ప్రీమియంలను తిరిగి పొందగలరు

Published : 26 Dec 2020 14:02 IST

6 డిసెంబర్ 2019 మధ్యాహ్నం 4:46

టర్మ్ ప్లాన్ అనేది దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. టర్మ్ ప్లాన్ లో, పాలసీ కాలవ్యవధి ముగిసిన తరువాత మీరు డబ్బును తిరిగి పొందలేరు. ప్రస్తుత మార్కెట్లో, ఒక విధమైన టర్మ్ ప్లాన్ అందుబాటులో ఉంది, అదే “రిటర్న్ ఆఫ్ ప్రీమియం టర్మ్ ఇన్సూరెన్స్ (ఆర్ఓపీ)”. ఆర్ఓపీ టర్మ్ ప్లాన్ లో, బీమా పాలసీ కాల వ్యవధి పూర్తైయ్యే వరకు మీకు ఎలాంటి ప్రమాదం జరగనట్లైతే, మీరు పాలసీ కోసం చెల్లించిన అన్ని ప్రీమియంలను తిరిగి పొందగలరు. ఈ అదనపు ప్రయోజనాన్ని ఆర్ఓపీ టర్మ్ ప్లాన్ అందిస్తుంది. అయితే, నిజంగా మీరు మెచ్యూరిటీ సమయంలో ఎంత డబ్బును తిరిగి పొందుతారో కింద తెలుసుకుందాం.

సాధారణ టర్మ్ ప్లాన్ తో పోల్చితే, రిటర్న్ ఆఫ్ ప్రీమియం టర్మ్ ఇన్సూరెన్స్ ను కొనుగోలు చేయడం లాభామో లేదో తెలుసుకుందాం. ఆర్ఓపీ ఫీచర్స్ ను కింద చూద్దాం:

  • మీరు ఫిక్స్డ్ ప్రీమియంను చెల్లించడం ద్వారా సంవత్సర కాలపరిమితితో బీమాను పొందుతారు.

  • మీ అకాల మరణం విషయంలో, మీ కుటుంబ సభ్యులు జీవిత కవర్ ప్రయోజనాన్ని పొందుతారు.

  • ఒకవేళ మీకు మెచ్యూరిటీ సమయం పూర్తైయ్యే వరకు ఎలాంటి ప్రమాదం జరగకపోతే, మీరు ఎలాంటి వడ్డీ లేకుండా చెల్లించిన అన్ని ప్రీమియంల మొత్తాన్ని తిరిగి పొందుతారు.

ఆర్ఓపీ ప్లాన్ లో, పాలసీ కాలపరిమితి పూర్తయ్యే సరికి ఎలాంటి ప్రమాదం జరగకపోతే, కనీసం చెల్లించిన ప్రీమియంలను తిరిగి పొందవచ్చుననే ఆలోచనలో మీరు ఉండవచ్చు. అయితే, సాధారణ టర్మ్ ప్లాన్ తో పోల్చితే, ఆర్ఓపీ ప్లాన్ కోసం మీరు సుమారు రెండు లేదా మూడు రెట్ల ప్రీమియంను చెల్లించాల్సి ఉంటుంది.

దీని అర్ధం, ఒకవేళ మీరు సాధారణ టర్మ్ పాలసీ కోసం రూ. 6,000 ప్రీమియంను చెల్లించినట్లయితే, ఆర్ఓపీ పాలసీని పొందటానికి రూ. 12,000 నుంచి రూ. 18,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రీమియం ఒక్కో బీమా సంస్థకు ఒకలా మారుతూ ఉంటుంది.

పాలసీ కాలపరిమితి ముగిసినప్పుడు, మీరు చెల్లించిన ప్రీమియంలను మాత్రమే తిరిగి పొందుతారు. ఒకవేళ మీరు టర్మ్ బీమా పాలసీని కొనుగోలు చేసినట్లయితే, మీరు ప్రతి సంవత్సరం కేవలం రూ. 6000 చెల్లించి, మిగిలిన రూ. 6,000 లను పీపీఎఫ్ లేదా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు. ఇలా చేయడం ద్వారా మీరు 8 నుంచి 10 శాతం ఖచ్చితమైన వడ్డీని పొందుతారు. 30 సంవత్సరాల పాటు సంవత్సరానికి రూ. 6000 చొప్పున పీపీఎఫ్ లో పెట్టుబడి పెట్టినట్లయితే, మీరు సుమారు రూ. 7,50,000 పొందవచ్చు. ఒకవేళ మీరు ఆర్ఓపీ ప్లాన్ ను ఎంచుకున్నట్లయితే, మీరు కేవలం రూ. 3,60,000 (రూ. 12000 * 30 సంవత్సరాలు) మాత్రమే పొందగలరు. అదే మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టినట్లయితే, 30 సంవత్సరాలలో మీరు రూ. 17.50 లక్షలు పొందవచ్చు.

రెండు సందర్భాల్లో, మీరు ఒకే రకమైన లైఫ్ కవరేజ్ ను పొందుతారు, కావున సంప్రదాయ టర్మ్ బీమాను కొనుగోలు చేసి, మిగిలిన మొత్తాన్ని మీ లక్ష్యాల ఆధారంగా మంచి ఆర్ధిక సాధనలలో పెట్టుబడిగా పెట్టడం మంచిది. సంక్షిప్తంగా చెప్పాలంటే, ఇది ఆర్ఓపీ ప్లాన్ నుంచి దూరంగా ఉండటానికి తెలివైన నిర్ణయం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని