Cyber frauds: సైబ‌ర్ మోసాల నుంచి సొమ్ము ఎలా కాపాడుకోవాలి?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆన్‌లైన్ లావాదేవీల పెరుగుద‌ల‌తో సైబ‌ర్ నేర‌స్థులు మ‌రిన్ని నూత‌న పోక‌డ‌లు అవ‌లంబించి అధునాత‌నంగా మారుతున్నారు. బ్యాంకు వినియోగ‌దారుల ఖాతాల నుంచి న‌గ‌దును దొంగిలించ‌డానికి కొత్త మార్గాల‌ను అన్వేషించి ఆన్‌లైన్ మోసాల‌కు పాల్ప‌డుతూ డ‌బ్బును కొల్ల‌గొడుతున్నారు. ఈ సైబ‌ర్ నేర‌గాళ్లు ఎక్కువుగా ఇత‌ర రాష్ట్రాల నుంచి మాట్లాడుతూ ఈ నేరాల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ సైబ‌ర్ నేర‌స్థులు వాళ్ల నెట్‌వ‌ర్క్ ద్వారా వినియోగ‌దారుల స్మార్ట్‌ఫోన్‌ను అధీనంలోకి తెచ్చుకుంటున్నారు.

ఉదాహ‌ర‌ణకు, స‌మాచారాన్ని యాక్సెస్ చేయ‌డానికి బ్యాంకు వినియోగ‌దారుల ఫోన్‌ను నియంత్రించ‌డానికి ధ్రువీకరించని మొబైల్‌ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని రిక్వెస్ట్ చేస్తారు. ఆ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకుంటే ఆ స్మార్ట్‌ఫోన్‌కు వ‌చ్చే స‌మాచారం అంతా ఈ సైబ‌ర్ నేర‌గాళ్ల నెట్‌వ‌ర్క్‌కి వెళుతుంది. బ్యాంకు వినియోగ‌దారుల ర‌హ‌స్య స‌మాచారాన్ని దొంగిలించ‌డానికి వారు మీ ‘కేవైసీ’ వివ‌రాల‌ను అప్‌డేట్ చేస్తున్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తూ వినియోగ‌దారుల చేత వారి బ్యాంక్ వివ‌రాలు తెలుసుకుంటారు. వివ‌రాలు తెలపకపోతే బ్యాంకు ఖాతా బ్లాక్ అవుతుంద‌ని చెప్ప‌డం లేదా ఉనికిలో లేని అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల గురించి మాట్లాడ‌టం ద్వారా వినియోగ‌దారుల‌ను ఒప్పిస్తారు.

మోస‌గాళ్లు.. బ్యాంక‌ర్లు, బీమా ఏజెంట్లు, హెల్త్‌కేర్, టెలికాం ఉద్యోగులు, ప్ర‌భుత్వ అధికారులుగా ప‌రిచ‌యం చేసుకుంటూ వినియోగ‌దారుల‌కు ఫోన్ కాల్స్ చేస్తుంటారు. వారు క‌ష్ట‌మైన‌, అవ‌స‌ర‌మైన సేవ‌ల‌ను అందించ‌డం ద్వారా గోప్య‌మైన ఆధారాల‌ను (ఓటీపీ, సీవీవీ) లేదా నంబ‌ర్లు తెలియ‌జేయాలని కోరుతుంటారు. కొన్ని సంద‌ర్భాల్లో బ్యాంకు ఖాతా నిలుపుద‌ల‌, క్లిష్ట‌మైన వైద్య సంర‌క్ష‌ణ ఉత్ప‌త్తుల స‌ర‌ఫ‌రా కొర‌త‌, ఇత‌ర విష‌యాలు ఉటంకిస్తూ స‌మాచారాన్ని అత్య‌వ‌స‌రంగా పంచుకోవాల‌ని వారు వినియోగ‌దారుల‌పై ఒత్తిడి తెస్తారు. ఈ మోసాల నుంచి మీ బ్యాంకు ఖాతాల‌ను ర‌క్షించుకోవ‌డానికి వినియోగ‌దారులు అనుస‌రించాల్సిన జాగ్ర‌త్త‌ల జాబితా ఇక్క‌డ ఉంది.

1)  తెలియ‌ని జాబ్ / ఇ-కామ‌ర్స్ పోర్ట‌ల్స్‌లో ఎప్పుడూ చెల్లింపులు చేయొద్దు. రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలో త‌మ బ్యాంకు ఖాతా వివ‌రాలు, డెబిట్ కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్ మొద‌లైన వాటి వివరాలను పంచుకునే వినియోగ‌దారుల‌ను మోసం చేయ‌డానికి సైబ‌ర్ నేరస్థులు న‌కిలీ వెబ్‌సైట్లు ఉప‌యోగిస్తారు. అటువంటి పోర్ట‌ల్స్ ప‌ట్ల జాగ్ర‌త్త వ‌హించండి. ఈ ప్లాట్‌ఫామ్స్‌లో మీ సుర‌క్షిత ఆధారాల‌ను పంచుకోకుండా ఉండండి.

2) ‘ఓటీపీ’, ‘పిన్‌’ షేర్ చేయ‌మ‌ని ఎవ‌రైనా అభ్య‌ర్థిస్తే వెంట‌నే అల‌ర్ట్ అవ్వండి. బ్యాంకు వినియోగ‌దారులు ‘పిన్‌’, ‘ఓటీపీ’ని ఎప్పుడూ ఇత‌రుల‌తో పంచుకోవ‌ద్దు. వినియోగ‌దారులు త‌మ బ్యాంకు ఖాతాలో డ‌బ్బును స్వీక‌రించ‌డానికి ‘పిన్‌’, ‘ఓటీపీ’ అవ‌స‌రం లేద‌నేది గుర్తుంచుకోండి. అలాగే మీ బ్యాంకు లేదా మ‌రే ఇత‌ర సంస్థ కూడా ఎటువంటి ర‌హ‌స్య స‌మాచారాన్ని డైర‌క్ట్‌గా గానీ, ఫోన్‌లో గానీ అడగదని గుర్తుంచుకోండి.

3) ఈ-మెయిల్స్‌లో గానీ, ఫోన్‌లో గానీ తెలియ‌ని లింక్‌లను క్లిక్ చేయొద్దు. కొన్ని ఆఫ‌ర్‌లు చాలా మంచివిగా, నిజంగా, అద్భుత‌మైన‌విగా క‌నిపించవొచ్చు. కాని అవి నిజం కాక‌పోవ‌చ్చు. మీరు మునుపెన్న‌డూ చూడ‌ని ఆఫ‌ర్‌ల‌ను వాగ్దానం చేసే కొత్త లింక్‌ల‌ను క్లిక్ చేస్తే.. మీరు మోసానికి గుర‌య్యే ఫిషింగ్ వెబ్‌సైట్‌ల‌కు మ‌ళ్లించే అవ‌కాశం ఉంది.

4) ఏదైనా సంస్థ‌ల‌ను సంప్ర‌దించ‌డానికి అధికారిక వెబ్‌సైట్‌ల‌ను ఉప‌యోగించండి. మోస‌గాళ్లు త‌ర‌చుగా వినియోగ‌దారుల‌ను మోసం చేయ‌డానికి అస‌లు వెబ్‌సైట్‌కు పోలి ఉండే త‌ప్పుడు క‌స్ట‌మ‌ర్ కేర్ నంబ‌ర్‌ల‌ను ఆన్‌లైన్‌లో పెడ‌తారు. ఆ నంబ‌ర్‌కు వినియోగ‌దారులు కాల్ చేయ‌గానే వారు త‌మ బ్యాంకు / బీమా కంపెనీకి చెందిన అధీకృత ప్ర‌తినిధితో మాట్లాడుతున్నార‌ని న‌మ్మించేలా వ్య‌వ‌హ‌రించి వినియోగ‌దారుల‌ను మోసం చేస్తారు. కాబట్టి బ్యాంకు / బీమా కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌డం ద్వారా ఈ కాంటాక్ట్‌ నంబర్‌లను మ‌ళ్లీ ధ్రువీకరించుకోవడం ఎప్పుడూ మంచిది.

5) కొన్ని వెబ్‌సైట్‌లలో వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు మీ మొబైల్లో జీ-పే, ఫోన్ పే లాంటి పేమెంట్ యాప్స్‌కు ఈ నేరస్థులు క్యూఆర్ కోడ్ లాంటివి పంపే అవకాశం ఉంటుంది. అలాంటివి క్లిక్ చేస్తే ఓటీపీ ఇవ్వడం వల్ల మీ బ్యాంకు ఖాతాలో డబ్బు నేరుగా వారికి వెళ్లిపోతుంది. ఇలాంటి స్కామ్‌ల నుంచి జాగ్రత్తగా ఉండాలి.

ఇలాంటి మోసాల నుంచి వినియోగదారులను కాపాడడానికి బ్యాంకులు అనేక మార్గాల ద్వారా అవగాహన కల్పిస్తున్నాయి. పైన తెలిపిన విషయాలతో పాటు బ్యాంకులు అందించే సమాచారాన్ని కూడా గమనించడం మంచిది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని