Stock Market Update: భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్‌ సూచీలు!

దేశీయ స్టాక్ మార్కెట్‌ (Stock Market) సూచీలు ఈవారాన్ని భారీ నష్టాలతో ప్రారంభించాయి....

Updated : 02 May 2022 09:36 IST

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్‌ (Stock Market) సూచీలు ఈవారాన్ని భారీ నష్టాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు సూచీలను ప్రభావితం చేస్తున్నాయి. శుక్రవారం అమెరికా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. యాపిల్‌, అమెజాన్‌ త్రైమాసిక ఫలితాలు నిరాశపర్చడమే ఇందుకు కారణం. మరోవైపు ప్రస్తుతం యూఎస్‌ ఫ్యూచర్స్‌ సైతం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నేడు ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. చైనా, హాంకాంగ్‌ మార్కెట్లకు నేడు సెలవు. చైనాలో కఠిన లాక్‌డౌన్‌లు, రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం వంటి పరిణామాలు కూడా సూచీలను కలవరపరుస్తున్నాయి. ఈ నెల 3-4 తేదీల్లో జరగనున్న అమెరికా ఫెడ్‌ సమావేశాల్లో వడ్డీ రేట్లను 50 బేసిస్‌ పాయింట్ల మేర పెంచొచ్చన్న అంచనాలు ఉన్నాయి. దేశీయంగా చూస్తే.. కంపెనీల త్రైమాసిక ఫలితాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి.

ఈ పరిణామాల మధ్య ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 362 పాయింట్ల నష్టంతో 56,698.01 వద్ద, నిఫ్టీ (Nifty) 115 పాయింట్లు నష్టపోయి 16,986 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.46 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. టైటన్‌, ఏషియన్‌ పెయింట్స్‌, సన్‌ఫార్మా, బజాజ్‌ ఫైనాన్స్‌, మారుతీ, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, విప్రో, ఎల్అండ్‌టీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

* నేడు ఫలితాలు ప్రకటించనున్న ప్రముఖ కంపెనీలు: అదానీ విల్మర్‌, జిందాల్‌ స్టెయిన్‌లెస్‌, ఐనాక్స్‌ లీజర్‌, ఐడీబీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ, క్యాస్ట్రాల్‌ ఇండియా, బ్రిటానియా ఇండస్ట్రీస్‌, మెఘమణి ఆర్గానిక్స్‌, మహీంద్రా హాలిడేస్‌, రిసార్ట్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, జేబీఎం ఆటో, ఈఐహెచ్‌ అసోసియేటెడ్‌ హోటల్స్‌, ద్వారికేశ్‌ షుగర్‌, దేవయానీ ఇంటర్నేషనల్‌, సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ సొల్యూషన్స్‌, అలెంబిక్‌ ఫార్మాస్యూటికల్స్‌, సరెగమ ఇండియా, ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని