ఎగ్జిట్ తేదీనీ ఉద్యోగులే అప్‌డేట్ చేసుకోవ‌చ్చు

ప్రావిడెంట్ ఫండ్ చందాదారులు తమ ఈపీఎఫ్‌ ఖాతాను అప్‌డేట్ చేయ‌డం చాలా ముఖ్యం....

Updated : 01 Jan 2021 18:54 IST

ప్రావిడెంట్ ఫండ్ చందాదారులు తమ ఈపీఎఫ్‌ ఖాతాను అప్‌డేట్ చేయ‌డం చాలా ముఖ్యం.

ఇక‌పై ఈపీఎఫ్ ఖాతాదారులు ఉద్యోగం మారితే ఎగ్జిట్ తేదీని ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవ‌చ్చ‌ని ఈపీఎఫ్ఓ పేర్కొంది. ఈపీఎఫ్ పోర్ట‌ల్ ద్వారా ఈ స‌దుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇంత‌కుముందు ఈపీఎఫ్ ఖాతాదారులు ఉద్యోగం మారిన త‌ర్వాత దీనికోసం పాత సంస్థ‌ల‌పై ఆధార‌ప‌డాల్సి వ‌చ్చేది. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఉద్యోగులు నేరుగా ఎగ్జిట్ తేదీని అప్‌డేట్ చేయ‌వ‌చ్చు.

ఎలా చేయాలి?

  1. ఈపీఎఫ్ఓ పోర్ట‌ల్‌లో యూఏఎన్, పాస్‌వ‌ర్డ్‌తో లాగిన కావాలి.
  2. “Manage” సెక్ష‌న్‌లో "Mark Exit పై క్లిక్ చేయాలి. అక్క‌డ “select employment” క‌నిపిస్తుంది.
  3. ఎగ్జిట్ తేదీ, కార‌ణం వివ‌రాల‌ను అందించాలి. త‌ర్వాత “Request OTP” ఆప్ష‌న్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు మీ ఆధార్ న‌మోదిత మొబైల్ నంబ‌ర్‌కు ఓటీపీ వ‌స్తుంది. ఓటీపీ ఎంట‌ర్ చేసి స‌బ్మిట్ చేయాలి.
  4. ఎగ్జిట్ తేదీ అప్‌డేట్ చేసిన‌ట్లుగా మీకు మెసేజ్ వ‌స్తుంది. ఇది పూర్త‌యిన త‌ర్వాత "View, “Service History” పై క్లిక్ చేస్తే ఈపీఎఫ్‌, ఈపీఎస్‌లో చేరిన తేది, నిష్క్ర‌మించిన తేదీ క‌నిపిస్తుంది.

ఉద్యోగం మానేసే రెండు నెల‌ల ముందు ఎగ్జిట్ తేదీని అప్‌డేట్ చేసే వీలుండ‌దు. కొన్ని సార్లు పాత సంస్థ‌లు స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో ఎగ్జిట్ తేదీని అప్‌డేట్ చేసే వీలుండ‌ట్లేద‌ని ఫిర్యాదులు వ‌చ్చిన నేప‌థ్యంలో ఈ మార్పులు తీసుకొచ్చారు.

ఈ తేదీని తెలియ‌జేస్తేనే ఈపీఎఫ్ ఉప‌సంహ‌రించుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. మీరు ఉద్యోగం మారిన‌ప్పుడు ఎగ్జిట్ తేదీ స‌రిగా లేక‌పోతే ఖాతాను కొన‌సాగింపుగా ప‌రిగ‌ణించ‌క‌పోవ‌చ్చు లేదా వ‌డ్డీపై ప‌న్ను చెల్లించాల‌ని అడిగే అవ‌కాశం కూడా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని