Fire Accident: ప్రొద్దుటూరు షాపింగ్‌మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం

వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులోని ఆకృతి షాపింగ్ మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.  రెండు అంతస్తుల్లో దట్టమైన పొగ అలముకుంది.

Published : 29 Jan 2024 10:51 IST

ప్రొద్దుటూరు: వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులోని ఆకృతి షాపింగ్ మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రెండు అంతస్తుల్లో దట్టమైన పొగ అలముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పొగ బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో భవనం ముందు భాగంలో ఏర్పాటు చేసిన అద్దాలను ధ్వంసం చేశారు. పొగ పీల్చుకోవడంతో అగ్నిమాపక సిబ్బంది సాంబ శివారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని